మద్రాసు హైకోర్టులో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అని చెప్పుకునే వ్యక్తి తమిళనాడులో వ్యభిచార గృహం నడుపుతున్నందుకు భద్రత కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
Honour Killing: తమిళనాడులోని విరుద్నగర్లో ‘పరువు హత్య’ చోటు చేసుకుంది. కార్తిక్ పాండీ(26) అనే వ్యక్తి, 8 నెలల క్రితం 22 ఏళ్ల నందిని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబానికి ఇష్టం లేకుండా ప్రేమించిన వ్యక్తిని నందిని వివాహమాడింది.
Union Budget: కేంద్ర బడ్జెట్ తమిళనాడులో అధికార డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారుణమవుతోంది. బడ్జెట్లో కేంద్రం తమిళనాడును పట్టించుకోలేదని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మన దేశంలో హీట్ పెంచుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఈ సారి యూఎస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారితో భారతదేశానికి సంబంధం ఉండటమే.
సముద్ర జలాల్లో అంతర్జాతీయ సరిహద్దు దాటిన తొమ్మిది మంది తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. రెండు పడవలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన మత్స్యకారులను కంగేసంతురై నేవల్ క్యాంపునకు తరలించారు.
తమిళనాడు పోలీసులు ఆరుగురు రష్యా పౌరులను అరెస్ట్ చేశారు. కుడంకుళం వద్ద ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ దగ్గర నుంచి ఆరుగురు రష్యన్ పౌరులు, ముగ్గురు భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. న్యూక్లియర్ రియాక్టర్ పరిసరాల్లో విదేశీయులు ఉన్నారని స్థానిక ప్రజలు సమాచారం ఇవ్వడంతో సోమవారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు IANSకి తెలిపారు.
DMK Leader: శ్రీరాముడిపై డీఎంకే మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. డీఎంకే నేత, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎస్ రెగుపతి మాట్లాడుతూ.. శ్రీరాముడు ‘‘ద్రావిడ నమూనాకు ఆద్యుడు’’ అని అన్నారు. సోమవారం కంబన్ కజగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాముడు సామాజిక న్యాయ పరిరక్షకుడు అని ఆయన అన్నారు.
Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్కి మంత్రి వర్గంలో ప్రమోషన్ వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే డీఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధి, స్టాలిన్ కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. అయితే, త్వరలోనే మంత్రివర్గంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతుంది. డీఎంకేలో మరో యువ నాయకుడ్ని ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీలో అన్నామలై లాంటి యువ నాయకులు రాజకీయాల్లో దూసుకుపోతున్నారు.