Supreme Court: హద్దులు దాటుతున్నారు.. ఈడీ దాడులపై తీవ్ర ఆగ్రహం
- హద్దులు దాటుతున్నారు
- ఈడీ దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం సంస్థ టాస్మాక్‌పై చేస్తున్న ఈడీ దాడులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఈడీ అన్ని హద్దులు దాటిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్.. కేంద్ర సంస్థకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం.. రాష్ట్రంలో ఈడీ చర్యలు అసమానమైనవిని.. అంతేకాకుండా రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: Komatireddy Venkat Reddy : బేగంపేట స్టేషన్ ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపిస్తోంది
Also Read
తమిళనాడులో రూ.1,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపించింది. మద్యం సరఫరా ఆర్డర్‌లను పొందడానికి డిస్టిలరీలు లెక్కల్లో చూపని నగదు ఇచ్చాయని పేర్కొంది. దీంతో తమిళనాడులో ఈడీ దాడులు చేస్తోంది. దీన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్ కొట్టేస్తూ ఈడీ దాడులకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సరైన ఆధారాలు లేకుండా ఈడీ దర్యాప్తు చేస్తోందని.. టాస్మాక్ సిబ్బందిని.. మహిళలను వేధిస్తున్నారని… గోప్యత.. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది. గురువారం పిటిషన్ విచారించిన ధర్మాసనం.. తక్షణమే దాడులు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఈడీ దాడులపై మండిపడింది. ఈడీ హద్దులు దాటి ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Vijay Sethupathi : ఘనంగా జరిగిన ‘ఏస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
సుప్రీంకోర్టు తీర్పుపై డీఎంకే ప్రభుత్వం హర్హం వ్యక్తం చేసింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని ధ్వజమెత్తింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈడీ దాడులకు కేంద్రం ఉసిగొల్పుతోందని ఆరోపించింది.
తాజావార్తలు
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు