Tamil Nadu: వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. అధికార డీఎంకేతో పాటు తమిళ స్టార్ విజయ్ పార్టీ టీవీకే, బీజేపీ, అన్నాడీఎంకేలు తమ తమ ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి. ఇదిలా ఉంటే, తమిళ ప్రజలు ఎవరిని సీఎంగా ఇష్టపడుతున్నారనే దానిపై సర్వే జరిగింది. సీఓటర్ సర్వే తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.
జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రం, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై కేంద్రం, కొన్ని రాష్ర్ట ప్రభుత్వాల మధ్య వివాదం సాగుతున్న విషయం విదితమే. తాజాగా వీటిని వ్యాతిరేకిస్తూ.. తమిళగ వెట్రి కళగం పార్టీ తీర్మానాలు చేసింది. శుక్రవారం తిరువన్మయూర్లో వియజ్ ఆధ్వర్యంలో తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 17 తీర్మానాలను ఆ పార్టీ ఆమోదించింది. ఈ సమావేశానికి హాజరైన విజయ్ ప్రసంగించారు.
Tamil Nadu: తమిళనాడు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, అధికార డీఎంకేని గద్దె దించే లక్ష్యంతో బీజేపీ, ఏఐడీఎంకేలు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఎన్కౌంటర్ జరిగింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాఫర్ గులాం హుస్సేన్ హతమయ్యాడు. మంగళవారం చెన్నై ఎయిర్పోర్టులో గులాం హుస్సేన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో భాగంగా నగలు దాచిన చోటు చూపిస్తానంటూ పోలీసులను జాఫర్ బయటకు తీసుకెళ్లాడు.
Delimitation Row: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిలేషన్)పై చెన్నై వేదిక తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సమావేశాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సమావేశానికి స్టాలిన్ అధ్యక్షత వహించగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం భవంత్ మాన్, టీఆర్ఎస్ నేత కేటీఆర్ వంటి వారు హాజరయ్యారు. మొత్తంగా ఈ సమావేశానికి 5 రాష్ట్రాల నుంచి 14 మంది నాయకులు పాల్గొన్నారు. జనాభా…
డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు సమర శంఖారావాన్ని పూరించాయి. ఇప్పటికే ఢిల్లీ వేదికగా తమిళనాడు డీఎంకే ఎంపీలు పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. తాజా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం జరగబోతుంది.
Amit Shah: ‘హిందీ’ భాషపై తమిళనాడు, కేంద్రం మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భాష పేరుతో దేశంలో ఇప్పటికే తగినంత విభజనలు జరిగాయి, ఇకపై అది జరగకూడదు’’ అని ఆయన అన్నారు.
Tamil Nadu: తమిళనాడు అరుణాచలం(తిరువణ్ణామలై)లో దారుణం జరిగింది. ‘‘మోక్షం’’ పేరులో ఒక ఫ్రెంచ్ మహిళను నమ్మించిన టూరిస్ట్ గైడ్, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫ్రాన్స్కి చెందిన 46 ఏళ్ల మహిళ జనవరి 2025లో తిరువణ్ణామలైలో ఒక ప్రైవేట్ ఆశ్రమంలో నివసిస్తోంది. గతేడాది కొండచరియలు విరిగిపడటంతో దీపమలై కొండపైకి ప్రజలను అనుమతించడం నిషేధించారు.
ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళా 2025 తర్వాత.. ఇప్పుడు అందరి కళ్ళు మరో కుంభమేళాపై ఉన్నాయి. ఈ కుంభమేళా దక్షిణ భారతదేశంలో జరుగుతుంది. తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో 'మహామహం' (కుంభమేళా) నిర్వహిస్తారు. ఈ 'మహామహం'లో కూడా దేశం నలుమూలల నుంచి దాదాపు కోటి మంది భక్తులు పవిత్రమైన అమృత స్నానానికి వస్తారు. ఈ కుంభమేళా కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 'మహామహం' సందర్భంగా.. "అఖిల భారత సన్యాసి సంఘం" నిర్వహించిన 'మాసి మహాపెరువిల- 2025' కార్యక్రమానికి…
తమిళనాడులో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇంకోవైపు అధికార డీఎంకే కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా పోరాటం చేస్తోంది. తమపై హిందీ భాష బలవంతంగా రుద్దుతోందని నిరసన గళాన్ని రేపుతోంది. ఇలా అధికార-విపక్షాల మధ్య రాజకీయ వార్ మొదలైంది.