Indonesia: మాదకద్రవ్యాల కేసులో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష
- మాదకద్రవ్యాల కేసులో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష
- కేంద్ర సాయం కోరుతూ ఢిల్లీ హైకోర్టులో భార్యలు పిటిషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష పడింది. 106 కిలోల మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసిన కేసులో ముగ్గురు భారతీయులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మరణశిక్షపై కేంద్రం తక్షణమే స్పందించాలని ఢిల్లీ హైకోర్టులో ముగ్గురు వ్యక్తుల జీవిత భాగస్వాములు పిటిషన్ దాఖలు చేశారు. మరణశిక్ష పడిన వారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియా కోర్టు తీర్పు కాపీని ఏప్రిల్ 29న పిటిషనర్లు అందుకున్నారని, ఈ కేసు మే 6న విచారణకు వస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Nani: ది ప్యారడైజ్‌లోకి అడుగు పెట్టేది అప్పుడే!
Also Read
- Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
లెజెండ్ అక్వేరియస్ కార్గో నౌకలో 106 కిలోగ్రాముల క్రిస్టల్ మెత్‌ను అక్రమంగా రవాణా చేశారనే ఆరోపణలతో గత ఏడాది జూలైలో తమిళనాడుకు చెందిన రాజు ముత్తుకుమరన్, సెల్వదురై దినకరన్, గోవిందసామి విమల్కందన్ అనే ముగ్గురు వ్యక్తులు అరెస్టు అయ్యారు. తాజాగా ఈ కేసులో ఇండోనేషియాలో మరణశిక్ష విధించబడింది. మాదకద్రవ్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇండోనేషియాలోని జిల్లా కోర్టు గత నెలలో ముగ్గురికి మరణశిక్ష విధించింది.
ఇది కూడా చదవండి: Army Jobs: ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీ ఉద్యోగాలు.. కొనసాగుతున్న విచారణ..
పిటిషన్ విచారించిన ఢిల్లీ హైకోర్టు.. మరణశిక్ష పడిన ముగ్గురు భారతీయులకు సాయం చేయాలంటూ ఇండోనేషియాలోని భారత కాన్సులేట్‌ను ఢిల్లీ ధర్మాసనం కోరింది. తగిన న్యాయ సహాయం అందేలా చూడాలని కోరిందని నివేదిక పేర్కొంది. దోషులుగా తేలిన భారతీయుల జీవిత భాగస్వాములు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని దౌత్య స్థాయిలో కొనసాగించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. అలాగే దోషులు-వారి కుటుంబాల మధ్య కమ్యూనికేషన్‌ను కూడా సులభతరం చేయాలని కోర్టు అధికారులను కోరిందని నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
-
Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
-
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
-
Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!