ఈరోజు మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడు. ఇప్పటికే 44 పరుగులు చేసి.. క్రీజులో ఉన్న కోహ్లీ పైనే క్రికెట్ అభిమానుల ఆశలు ఉన్నాయి. ఈ ఏడాదంతా మంచి ఫాం కనబరుస్తున్న కోహ్లీ.. అదే ఫామ్ ను కంటిన్యూ చేయాలని కోరుతున్నారు.
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసి.. టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని ముందుంచుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. రోహిత్ శర్మ (15), గిల్ (13) పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో భారత్ కష్టాల్లోకి వెళ్లిపోయింది.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్ములేపుతున్నారు. భారీ స్కోరు మీద కన్నేసిన ఆసీస్.. ఫస్ట్ డే 327-3 వద్ద ఆట ముగియగా.. రెండో రోజు ఆట ఆరంభించి అదే దూకుడు ప్రదర్శన కొనసాగిస్తున్నారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మియా.. ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మ్యాచ్ ఆరంభంలోనే ఒక వికెట్ తీసి శుభారంభాన్ని అందించిన సిరాజ్.. ఆసీస్ బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు.
రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ కేఎస్ భరత్ ల వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ చేస్తోంది. మాములుగా ఐతే క్రికెటర్స్ సోషల్ మీడియాను ఎక్కువగానే ఫాలో అవుతుంటారు. వారి ఫోటోస్, వీడియోస్ పెట్టడం లాంటివి చేస్తూంటారు. కానీ లండన్ లో టీమిండియా ఫోటోషూట్ సందర్భంగా.. అశ్విన్, భరత్‌ల ఓ ఫన్నీ వీడియో బయటకు వచ్చింది. వీడియోలో, అశ్విన్ ఫుల్ జోవియల్ మూడ్‌లో కనిపించాడు.
టీమిండియా బ్యాటర్లను ఇబ్బందిపెట్టేందుకు ఆసీస్ ప్రణాళికలు రచించుకున్నారు. అందుకు సంబంధించి ఆసీస్.. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఫైనల్ బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చెప్పాడు. ఇక ఈ ముగ్గురిలో తనతో పాటు, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలండ్ ఉన్నారని తెలిపాడు.
ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ రేపు(బుధవారం) ప్రారంభం కానుంది. లండన్ లోని ఓవల్ మైదానంలో ఛాంపియన్ షిప్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. వరుసగా రెండోసారి టెస్ట్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు వచ్చిన భారత్.. ఈసారైనా కప్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది.
ఐపీఎల్ కొందరి క్రికెటర్ల భవిష్యత్ ను మార్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ ద్వారా తమ ట్యాలెంట్ ను వెలికితీసి మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన భారత యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌పై పాక్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు.
మహేంద్ర సింగ్ ధోని మోకాలి శస్త్రచికిత్స విజయవంతమైంది. గురువారం(జూన్ 1) ఉదయం 8 గంటల సమయంలో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లో ఈ ఆపరేషన్ జరిగింది. ఆర్థోపెడిషియన్ దిన్షా పార్దివాలా ఈ ఆపరేషన్ చేశారు.
ఇంగ్లాండ్‌కి చెందిన 37 ఏళ్ల వికెట్ కీపర్- బ్యాటర్ క్రిస్ కుక్ గ్లామోర్గాన్ జట్టు తరఫున ఆడుతున్నాడు. మిడిల్సెక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బ్యా్ట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే 275 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసాడు. 7 సిక్సర్లు, 12 బౌండరీలతో అద్భుత సెంచరీ (113) పరుగులు చేశాడు.