వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. వెస్టిండీస్-భారత్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జులై 20(గురువారం) ట్రినిడాడ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఎందుకంటే.. ఇరు దేశాల మధ్య 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. అయితే ఈ 100వ టెస్టులో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఏంటని కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించగా.. తాను ఏమీ సమాధానం చెప్పలేదు. కాదంటే.. ప్లేయింగ్ XIలో ఎవరి పాత్ర ముఖ్యమైనది అనే దాని గురించి మాట్లాడాడు. డొమినికాలో ప్లేయింగ్ లెవన్ పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఏమి చెప్పాడంటే.. మొత్తం ప్లేయింగ్ XIని తన వేళ్లపై లెక్కించాడు. అతను మ్యాచ్‌కు ఒక రోజు ముందే ఎవరెవరు అరంగేట్రం చేయబోతున్నారో చెప్పాడు.
Tamannah : స్టన్నింగ్ లుక్ తో అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ..
ట్రినిడాడ్‌లో ప్లేయింగ్ లెవన్ పై కెప్టెన్ రోహిత్ శర్మను అడిగినప్పుడు.. సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా చాలా కారణాలను చెప్పాడు. డొమినికా మరియు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మధ్య వ్యత్యాసాన్ని ఎత్తి చూపాడు. డొమినికా పరిస్థితి.. అక్కడి పిచ్ గురించి తనకు బాగా తెలుసునని రోహిత్ అన్నారు. కానీ.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ విషయంలో అలా కాదన్నాడు. అంతేకాకుండా ట్రినిడాడ్ లో ప్రతికూల వాతావరణమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. పిచ్ కండిషన్ ఎలా ఉంటుందో ఇంకా తెలియదని రోహిత్ శర్మ అన్నారు. అంతేకాకుండా అక్కడ వర్షం కూడా పడుతుంది. అటువంటి పరిస్థితిలో రోహిత్ శర్మ మ్యాచ్‌కు ముందు ప్లేయింగ్ ఎలెవన్‌పై తుది నిర్ణయం తీసుకోవచ్చు. ట్రినిడాడ్ లో టీం ఇండియా ప్లేయింగ్ XI గురించి రోహిత్ ఏమీ చెప్పనప్పటికీ.. జట్టులో పెద్దగా మార్పు ఉండదని వార్తలు వస్తున్నాయి.