నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు అనుకున్నట్టుగానే విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో టీమిండియా మహిళల జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టి20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఆఫ్ఘనిస్థాన్ జట్టు స్పిన్ బౌలింగ్‌కు చాలా ఫేమస్ అని క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసిన విషయమే. ఈ జట్టులో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి బౌలర్లు.. ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బంది పెట్టగలరు. అయితే శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ బ్యాట్స్మెన్లు తమ సత్తా చాటుతూ భారీ స్కోరు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది.
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) నుంచి తప్పుకుంటున్నట్లు అంబటి రాయుడు తెలిపాడు. ఈ విషయాన్ని టెక్సాస్ సూపర్ కింగ్స్ ట్విటర్లో తెలిపింది. రాయుడు లీగ్ నుంచి తప్పుకుంటున్న విషయమై.. టీఎస్కే ట్వీట్ లో వివరణ ఇచ్చింది. ‘ఎంఎల్సీ ఫస్ట్ సీజన్ లో అంబటి రాయుడు అందుబాటులో ఉండటం లేదు.
వెస్టిండీస్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందులో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. గత ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన తిలక్.. ఎట్టకేలకు టీ20ల్లో స్థానం దక్కించుకున్నాడు. అందరూ అనుకున్నట్టుగానే జాతీయ స్థాయిలో ఆడుతాడని పలువురు క్రికెటర్లు చెప్పారు.
వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ చెమటలు వచ్చేలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. బార్బడోస్‌లో నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న విరాట్ కోహ్లీ.. అద్భుతమైన షాట్లు ఆడాడు. ఇండియా -పాకిస్తాన్ అభిమానులు ఒకరినొకరు తిట్టుకునేలా విరాట్ ఏ షాట్ ఆడాడని మీరు అనుకుంటున్నారా..! అసలు విషయానికి వస్తే.. బార్బడోస్ లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్.. అశ్విన్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడాడు.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదలైంది. అందులో కింగ్ కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపిస్తుంది. తన తోటి ఆటగాళ్లతో కలిసి నెట్ లో బిజీగా గడిపేస్తున్నాడు.
ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నీలో పాల్గొనే భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం ప్రకటించింది. దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటుతున్న ఆంధ్ర పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.
పాకిస్థాన్ బౌలింగ్ లో మెరుపు వేగంతో బౌలింగ్ వేసే బౌలర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది షహీన్ షా ఆఫ్రిది. అంతేకాదు పాకిస్తాన్ బౌలర్లలో అఫ్రిది తర్వాత నసీమ్, హరీస్ సోహైల్ మంచి ప్రదర్శన చూపిస్తారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ బౌలర్లలో మరో ఆటగాడు తన పేరును నమోదు చేసుకున్నాడు. 21 ఏళ్ల ఉన్న జమాన్ ఖాన్.. అతను బౌలింగ్ చేసే విధానం చూస్తే.. రాబోయే రోజుల్లో ప్రత్యర్థులకు షాహీన్ కంటే బలంగా మారే అవకాశం ఉంది.
ప్రపంచకప్‌లో భారత్ నంబర్-4 బ్యాట్స్‌మెన్ ఎవరు అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది. శ్రేయాస్ అయ్యర్ ఈ నంబర్లో ఆడాల్సి ఉంది. కానీ అతను ప్రస్తుతం గాయంతో ఉన్నాడు. అతను ఎప్పుడు తిరిగి ఫిట్‌గా అవుతాడనేది తెలియడంలేదు. మరోవైపు ప్రపంచ కప్ కోసం భారత జట్టులో టాప్ ఆర్డర్లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీల స్థానం స్థిరంగా ఉంది. నాలుగో నెంబర్ లో శ్రేయస్ లాంటి మంచి బ్యాట్స్…
ఐపీఎల్లో ఆడలేదని అభిమన్య ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్ లకు వెస్టిండీస్ టూర్ లో చోటు దక్కలేదని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆరోపించారు. దేశవాళీ క్రికెట్లో వారు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని వసీం తెలిపాడు. అయితే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత వన్డే, టెస్టు జట్టును నిన్న ప్రకటించారు. ఇప్పుడు జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.