Bangladesh Poll Results: తారిక్ రెహమాన్‌దే బంగ్లాదేశ్
- బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీ భారీ విజయం
- 209 స్థానాలు కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ
- బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న తారిక్ రెహమాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) భారీ విజయం సాధించింది. 299 స్థానాలకు గాను 209 స్థానాలు గెలుచుకుంది. ఇక బీఎన్‌పీ అధినేత తారిక్ రెహమాన్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఘన విజయం సాధించారు. బంగ్లాదేశ్ తదుపరి ప్రధానిగా తారిక్ రెహమాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
గురువారం బంగ్లాదేశ్ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసన తర్వాత సాయంత్రం 4:30 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటి నుంచి తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీనే ఆధిక్యం దిశగా దూసుకుపోయింది. జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ అంత ప్రభావం చూపించలేదు. బంగ్లాదేశ్‌లో మొత్తం 300 పార్లమెంట్ స్థానాలు ఉండగా ఒక అభ్యర్థి మరణంతో అక్కడ పోలింగ్ ఆగిపోవడంతో 299 స్థానాలకు ఓటింగ్ జరిగింది. తాజా ఫలితాల్లో 208 స్థానాలను బీఎన్‌పీ గెలుచుకుంది.
Also Read
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
తారిక్ రెహమాన్..
తారిక్ రెహమాన్.. బీఎన్‌పీ ఛైర్‌పర్సన్ ఖలీదా జియా కుమారుడు. ఇటీవలే ఆమె కన్నుమూసింది. ఇక 17 ఏళ్ల తర్వాత తారిక్ రెహమాన్ లండన్ నుంచి బంగ్లాదేశ్‌కు వచ్చారు. సమయం తక్కువగా ఉన్న ప్రచారంలో దూసుకుపోయారు. ప్రజలు సుస్థిరమైన పాలనకు ఓటేశారు.
ఆగస్టు, 2024లో విద్యార్థుల నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలోకి వస్తే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యమని తారిక్ రెహమాన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు.
ఇది కూడా చదవండి: Ind vs Nam : నమీబియాపై భారత్ ఘనవిజయం.. ఇషాన్, హార్దిక్ మెరుపులు.!
- Tags
- Tarique Rahman
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!