రోహిత్ శర్మను ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగడం మీరెప్పుడైనా చూశారా..? ఎక్కువగా ఓపెనర్ గా దిగే హిట్ మ్యాన్.. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఒకటి నిన్న(జూలై 27)న జరిగింది. ఏ ఫార్మాట్ గానీ ఓపెనర్ గానే బ్యాటింగ్ దిగి.. విధ్వంసం సృష్టించగల హిట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అందరినీ షాక్ అయ్యేలా చేశాడు.
Bramhaji : బ్రహ్మాజీ యంగ్ లుక్ సీక్రెట్ లీక్.. అది తాగుతాడా?
రోహిత్ శర్మ ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగపోవడానికి కారణముంది. అదెంటంటే.. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగారు. ఇక ఆ తర్వాత స్థానంలో రావాల్సిన కోహ్లి కూడా బ్యాటింగ్‌కు రాలేదు. అయితే త్వరలో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలాబలాలు తెలుసుకునేందుకు వన్డే స్పెషలిస్ట్‌కు అవకాశం ఇవ్వాలని ఇలా ప్లాన్ చేసినట్లు రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం తెలిపాడు.
DK Aruna : ప్రజల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి… మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం చేతులెత్తేశారు
అసలు రోహిత్ శర్మ కెరీర్ ఆరంభంలో ఆరు, ఏడు స్థానాల్లోనే బ్యాటింగ్ కు దిగేవాడు. చివరిసారి 2011 జనవరిలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో ఏడో స్థానంలో రోహిత్ బ్యాటింగ్ చేశాడు. ఇక నిన్న మ్యాచ్ అనంతరం రోహిత్ ఆ విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నాడు. అందులో ట్విస్ట్ ఏంటంటే.. అదే ఏడాది ఏప్రిల్లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. కానీ రోహిత్ ఆ వరల్డ్‌కప్‌లో ఆడేందుకు అవకాశం లభించలేదు. మరోవైపు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టీమిండియా తరపున అరంగేట్రం చేసినప్పుడు ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడినని తెలిపాడు. తాజాగా విండీస్‌తో తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ద్వారా మళ్లీ తనకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు. ఇక తొలి వన్డేలో భారత్ గెలిచి మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జూలై 29న(శనివారం) బార్బడోస్ వేదికగా జరగనుంది.