Jowar Bun Dosa Recipe: అప్పటికప్పుడే అదిరిపోయే హెల్తీ, టేస్టీ జొన్న బన్ దోశ.. కొత్తగా ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jowar Bun Dosa Recipe: టిఫిన్‌లో తరచూ తినే ఐటెమ్స్ ఉంటే బోరింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు కాస్త భిన్నంగా ట్రై చేద్దాం. బ్రేక్‌ఫాస్ట్‌లో కొత్తగా, ఆరోగ్యంగా ఏదైనా చేయాలనిపిస్తే జొన్న బన్ దోశ బెస్ట్ అని చెప్పొచ్చు. సాధారణంగా ఈ అనే వంటకం భారతీయది కాదు. కానీ ప్రస్తుతం ట్రేడింగ్‌గా మారింది. ఈ రెసిపీ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ దోశ మృదువుగా ఉంటుంది. ముఖ్యంగా జొన్న పిండి, పెరుగు, కొద్దిగా రవ్వ, కూరగాయలతో ఇది తయారవుతుంది. పులియబెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఉదయం తక్కువ టైమ్‌లో ఈజీగా చేసుకోవచ్చు. పిండి గట్టిగా ఉండటం వల్ల లోపల నెమ్మదిగా ఉడికి, తిన్నాక పొట్ట నిండిన భావన ఇస్తుంది. జొన్నలో ఫైబర్, ఇనుము, ప్రోటీన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది శరీరానికి బలం ఇస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరిపడే అల్పాహారం ఇది.
READ MORE: స్లిమ్ బెజెల్స్, టూ-వే స్పీకర్లతో రాబోతున్న Xiaomi X Pro QLED (2026) 75 అంగుళాల టీవీ.. ఫీచర్స్ ఇవే!
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
జొన్న బన్ దోశ దోశ..
ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో మూడు వంతుల కప్పు జొన్న పిండి, అర కప్పు రవ్వ, మూడు వంతుల కప్పు పెరుగు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందులో అర కప్పు నీళ్లు వేసి ముద్దలు లేకుండా బాగా కలపాలి. మిశ్రమం మృదువుగా ఉండాలి. ఇప్పుడు తురిమిన అర క్యారెట్, సన్నగా తరిగిన అర ఉల్లిపాయ, అర క్యాప్సికం, రెండు స్పూన్లు తరిగిన క్యాబేజీ, రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రెండు స్పూన్లు కొత్తిమీర కలపాలి. అదనంగా అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ వేసి బాగా కలపాలి. ఇలా అన్నీ కలిసిన తర్వాత పిండి కొద్దిగా గట్టిగానే ఉండాలి. చివరిగా అర టీ స్పూన్ ఇనో వేసి మెల్లగా కలపాలి. వెంటనే పిండిలో చిన్న చిన్న బుడగలు వస్తాయి. అదే ఈ బన్ దోశను మృదువుగా చేస్తుంది. ఇప్పుడు చిన్న పాన్ లేదా దోశ తవా వేడి చేసి, దానిపై కొద్దిగా నూనె రాయాలి. ఒక గరిటె పిండిని తీసుకుని మధ్యలో పోసి కొంచెం మందంగా పరచాలి. ఎక్కువ పల్చగా కాకుండా చూసుకోవాలి. మూత పెట్టి రెండు నిమిషాలు నెమ్మదిగా కాల్చాలి. కింద భాగం బంగారు రంగులోకి మారిన తర్వాత తిప్పి మరో వైపు కూడా కాల్చాలి. రెండు వైపులా సమంగా ఉడికితే సరిపోతుంది. ఇలా వేడి వేడి జొన్న బన్ దోశ సిద్ధమవుతుంది. దీనిని కొబ్బరి చట్నీ, పెరుగు లేదా టమాటో సాస్‌తో తింటే రుచి మరింత పెరుగుతుంది. ఉదయం తొందరగా చేయడానికి సులభం, ఆరోగ్యంగా ఉండేందుకు మంచిది. వారానికి ఒక్కసారి అయినా ట్రై చేయండి..
తాజావార్తలు
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!