SRH టీమ్.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో పేలవ ప్రదర్శన చూపిన కొంతమంది ఆటగాళ్లపై వేటు వేయాలని చూస్తోంది. గత సీజన్ లో రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టి.. కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
రోహిత్ శర్మను ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగడం మీరెప్పుడైనా చూశారా..? ఎక్కువగా ఓపెనర్ గా దిగే హిట్ మ్యాన్.. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన సందర్భాలు ఉన్నాయి.
ఇవాళ జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టు ముందు బిగ్ టార్గెట్ ను ఉంచింది. కొలొంబో వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా.. టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.
ఈ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చిర్రెత్తిపోయింది. ఔట్ కాకుండా అంపైర్ ఔట్ ఇచ్చినందుకు సహనాన్ని కోల్పోయింది. బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. భారత ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నహిదా అక్తర్ బౌలింగ్‌లో మూడో బంతిని హర్మన్‌ప్రీత్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది.
బంగ్లాదేశ్ తరఫున మహిళల వన్డే క్రికెట్లో తొలి సెంచరీ నమోదైంది. ఇండియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (జులై 22) జరుగుతున్న మూడో వన్డేలో ఫర్జానా హాక్ సెంచరీ చేసింది.
శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లాహిరు తిరిమన్నె అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు శనివారం వీడ్కోలు పలికాడు. అతను సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సహా ఐదుగురు ఆటగాళ్లు పునరావాసంలో ఉన్నారు. అయితే వారు తిరిగి మ్యాచ్‌లు ఆడేందుకు.. ఎంత ఫిట్‌గా ఉన్నారు. ఎప్పుడు స్టేడియంలోకి అడుగుపెడుతారనే విషయాన్ని బీసీసీఐ శుక్రవారం తెలిపింది.