ఇంగ్లాండ్‌కి చెందిన 37 ఏళ్ల వికెట్ కీపర్- బ్యాటర్ క్రిస్ కుక్ గ్లామోర్గాన్ జట్టు తరఫున ఆడుతున్నాడు. మిడిల్సెక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బ్యా్ట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే 275 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసాడు. 7 సిక్సర్లు, 12 బౌండరీలతో అద్భుత సెంచరీ (113) పరుగులు చేశాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి భద్రతను పెంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి 'వై' కేటగిరీ భద్రతను పొందేందుకు అర్హులైన భారత క్రికెట్ మాజీ కెప్టెన్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించనున్నారు.
CM Cup 2023: మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని సర్కార్ భావించింది. ఎంతో టాలెంట్ ఉండి గ్రామాలకే పరిమితమవుతున్న క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు, వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్-2023 క్రీడాపోటీలకు శ్రీకారం చుట్టింది.