క్రికెట్ లో కొంత మంది ప్లేయర్స్ చాలా కూల్ గా, మరికొందరు చాలా కోపంగా కనిపిస్తారు. టీమిండియాలో ధోని ఎంత కూల్ గా ఉంటాడన్నది అందరికీ తెలుసు.. అలాగే కింగ్ కోహ్లీ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడనేది కూడా తెలుసు. ఇది మెన్స్ కు సంబంధించిన విషయం. మరీ ఉమెన్స్ కూడా అగ్రెసివ్ గా ఉంటారా అంటే.. ఈ వీడియో చూస్తే మీకే అర్ధమౌతుంది.
Earn money: ట్రక్కు నడుపుతూ నెలకు రూ.63 లక్షలు సంపాదిస్తున్న మహిళ
ఢాకా వేదికగా భారత మహిళల జట్టు, బంగ్లాదేశ్ మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో ట్రోఫీని భారత్-బంగ్లాదేశ్ జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. 226 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా సరిగ్గా 225 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖరి ఓవర్‌లో భారత విజయానికి మూడు పరుగులు అవసరమవ్వగా.. స్ట్రైక్‌లో ఉన్న మేఘనా సింగ్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో మ్యాచ్ టై అయింది.
Defamation Case: రూ.2 కోట్లు చెల్లించాల్సిందే.. పరువు నష్టం కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు ఎదురుదెబ్బ
ఈ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చిర్రెత్తిపోయింది. ఔట్ కాకుండా అంపైర్ ఔట్ ఇచ్చినందుకు సహనాన్ని కోల్పోయింది. బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. భారత ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నహిదా అక్తర్ బౌలింగ్‌లో మూడో బంతిని హర్మన్‌ప్రీత్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకింది. ఈ క్రమంలో బంగ్లా క్రికెటర్లు ఎల్బీకి అప్పీలు చేయగా.. అంపైర్ వెంటనే ఔట్ అని ప్రకటించాడు. అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హార్మన్ ప్రీత్.. తన బ్యాట్‌తో సంప్ట్ప్‌ను పడగొట్టి పెవిలియన్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb
— Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023