గత ఏడాది రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్.. చావు అంచుల వరకు వెళ్లొచ్చాడని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే తను నడిపిన కారు నుజ్జునుజ్జైంది. అలాంటిది అతను ప్రాణాలతో తిరిగొచ్చాడు. దీంతో అప్పటి నుంచి క్రికెట్ కు దూరమయ్యాడు. అతని తల, వీపుకు బలమైన గాయాలయ్యాయి. కాలికి ఫ్రాక్చర్ అయింది. అతడి కుడి మోకాలికి తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స జరిగింది. అలాంటిది అతని పరిస్థితి చూస్తే.. పూర్తిగా ఫిట్‌గా ఉండేందుకు ఏడాది పట్టే అవకాశం ఉందనిపించింది. కానీ.. బీసీసీఐ ఇచ్చిన మెడికల్ అప్‌డేట్ తర్వాత.. అక్టోబరులో జరగనున్న ప్రపంచకప్‌లో అతడిని ఆడిపించాలనే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది.
Extramarital Affair: భర్త ఇంట్లో ఉండగానే.. ప్రియుడ్ని ఇంటికి పిలిపించి..
మరోవైపు పంత్ చాలా వేగంగా కోలుకుంటున్నాడు. 2 నెలల క్రితం ఊతకర్రల సాయంతో నడిచిన పంత్.. ఇప్పుడు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. 2 నెలల్లో చాలా కోలుకున్నాడని.. ప్రపంచ కప్‌కు ఇంకా రెండున్నర నెలల సమయం ఉండటంతో.. మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ప్రస్తుతం రిషబ్.. NCAలో పునరావాసంలో ఉన్నాడు.
Snakes: అల్లుళ్లకు కట్నంగా స్నేక్ రాజాలు.. అదే వారి ఆచారం..!
ఈ ఏడాది జనవరిలో పంత్‌కు మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స తర్వాత.. అతను ఫిబ్రవరిలో క్రచెస్ సహాయంతో మొదటిసారి ఇంటి వద్ద నడుస్తూ కనిపించాడు. ఆ సమయంలో అతని కుడి కాలులో చాలా వాపు వచ్చింది. పాదాలు కిందికి దింపడం కూడా కష్టంగా మారింది. ఇది జరిగిన సరిగ్గా నెల రోజుల తర్వాత.. మార్చిలో అతను వాకింగ్ స్టిక్ సహాయంతో నడుస్తూ కనిపించాడు. మేలో అతను తన ఊతకర్రల సహాయం లేకుండా నడవడం ప్రారంభించాడు. జూన్‌లో బరువులు ఎత్తడం కూడా ప్రారంభించాడు. అంతేకాదు.. నెట్స్‌లో బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పంత్ వేగంగా ఫిట్ అవుతుండటతో.. అతడు ప్రపంచకప్‌లో ఆడతాడన్న ఆశ టీమిండియా అభిమానుల మదిలో మెదులుతుంది.