IND vs PAK: శతక్కొట్టిన పాక్ బ్యాటర్.. కష్టాల్లో భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానులు టీవీలకే అతుక్కుపోతారు. ఆ జట్ల మధ్య మ్యాచ్ అంటే క్రేజ్ అలా ఉంటుంది. అలాంటిది ఇండియా, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ అంటే ఇంక ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. ఐతే ఇవాళ జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఏ.. భారత-ఏ జట్టు ముందు బిగ్ టార్గెట్ ను ఉంచింది. కొలొంబో వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా.. టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్.. ఓపెనర్లు సైమ్ అయూబ్ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్‌జాదా ఫర్హాన్ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్ తాహిర్ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Ram Charan: ఎంతో కష్టపడి ఆ పని చేస్తే.. ఉపాసన చెంపమీద కొట్టింది
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మరోవైపు భారత బౌలర్లలో హంగార్గేకర్, రియాన్ పరాగ్ చెరో 2 వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, మానవ్ సుతార్, నిషాంత్ సింధు తలో వికెట్ దక్కించుకున్నారు. బ్రేక్ అనంతరం టీమిండియా ఓపెనర్లు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ కు దిగారు. అర్షద్ ఇక్బాల్ బౌలింగ్ లో సాయి సుదర్శన్(29), మహ్మద్ జూనియర్ బౌలింగ్ లో నికిన్ జోస్(11) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ శర్మ(28), యష్ ధుల్ ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా టిమిండియాకు నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు. భారత్ తరుపున బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉందని.. ఎలాగైనా ఇండియా విజయం సాధిస్తుందని తెలుపుతున్నారు. చూడాలి మరీ ఈ ఫైనల్ మ్యాచ్ లో కప్ ఎవరిని వరిస్తుందో.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!