Fargana Hoque: బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదు.. రికార్డు బద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ తరఫున మహిళల వన్డే క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదైంది. ఇండియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (జులై 22) జరుగుతున్న మూడో వన్డేలో ఫర్జానా హాక్ సెంచరీ చేసింది. (160 బంతుల్లో 107; 7 ఫోర్లు) ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు 2013 ఏప్రిల్ లో బంగ్లాదేశ్ తరఫున సల్మా ఖాతూన్ 75 పరుగులు చేసింది. ఆ స్కోకే ఇప్పటివరకు అత్యధిక స్కోర్. అయితే ఆ రికార్డును ఫర్జానా బద్దలు కొట్టింది. అంతకుముందు ఫర్జానా ఖాతాలో మరో 2 రికార్డులు కూడా ఉన్నాయి. బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు (56 మ్యాచ్‌ల్లో 25.83 సగటున 1240 పరుగులు), బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు (9) ఫర్జానా పేరిట ఉన్నాయి.
Samantha Break: ఏడాది రెస్ట్.. సమంతకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?
Also Read
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
అంతేకాకుండా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫర్జానా 160 బంతులు ఎదుర్కొంది. మహిళల క్రికెట్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఐదో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కింది. టీమిండియా తరుపున బ్యాటర్ దీప్తి శర్మ కూడా ఉన్నారు. ఈ జాబితాలో ఐర్లాండ్ అన్నె ముర్రే (171) టాప్‌లో ఉంది. ఇదిలా ఉంటే.. ఫర్జానా రికార్డు సెంచరీ సాధించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఫర్జానాతో పాటు మరో ఓపెనర్ షమీమా సుల్తానా (52) అర్ధసెంచరీతో రాణించింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (24), ఆఖర్లో శోభన మోస్త్రీ (23 నాటౌట్) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 2, దేవిక వైద్య ఓ వికెట్ పడగొట్టారు.
Teacher Harassment: యువతిపై మాష్టారు లైంగిక వేధింపులు.. గుడ్డలూడదీసి మరీ..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 49.3 ఓవర్లలో ఆలౌట్ కాగా.. మ్యాచ్ టైగా ముగిసింది. స్మృతి మంధన (59) అర్ధశతకంతో మెరవగా.. హర్లీన్ డియోల్ (77), జెమిమా రోడ్రిగ్స్ (33 నాటౌట్) గా ఉంది. బంగ్లా బౌలర్లలో నహిద అక్తర్ 3 వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తర్ ( 2 ), సుల్తానా ఖాతూన్, రాబియా ఖాతూన్, ఫామిమా ఖాతూన్ తలో వికెట్ తీశారు.
- Tags
- Bangladesh
- Century
- first
- record
- Sports
తాజావార్తలు
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!