వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ చెమటలు వచ్చేలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. బార్బడోస్‌లో నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న విరాట్ కోహ్లీ.. అద్భుతమైన షాట్లు ఆడాడు. ఇండియా -పాకిస్తాన్ అభిమానులు ఒకరినొకరు తిట్టుకునేలా విరాట్ ఏ షాట్ ఆడాడని మీరు అనుకుంటున్నారా..! అసలు విషయానికి వస్తే.. బార్బడోస్ లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్.. అశ్విన్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడాడు.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదలైంది. అందులో కింగ్ కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపిస్తుంది. తన తోటి ఆటగాళ్లతో కలిసి నెట్ లో బిజీగా గడిపేస్తున్నాడు.
ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నీలో పాల్గొనే భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం ప్రకటించింది. దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటుతున్న ఆంధ్ర పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.
పాకిస్థాన్ బౌలింగ్ లో మెరుపు వేగంతో బౌలింగ్ వేసే బౌలర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది షహీన్ షా ఆఫ్రిది. అంతేకాదు పాకిస్తాన్ బౌలర్లలో అఫ్రిది తర్వాత నసీమ్, హరీస్ సోహైల్ మంచి ప్రదర్శన చూపిస్తారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ బౌలర్లలో మరో ఆటగాడు తన పేరును నమోదు చేసుకున్నాడు. 21 ఏళ్ల ఉన్న జమాన్ ఖాన్.. అతను బౌలింగ్ చేసే విధానం చూస్తే.. రాబోయే రోజుల్లో ప్రత్యర్థులకు షాహీన్ కంటే బలంగా మారే అవకాశం ఉంది.
ప్రపంచకప్‌లో భారత్ నంబర్-4 బ్యాట్స్‌మెన్ ఎవరు అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది. శ్రేయాస్ అయ్యర్ ఈ నంబర్లో ఆడాల్సి ఉంది. కానీ అతను ప్రస్తుతం గాయంతో ఉన్నాడు. అతను ఎప్పుడు తిరిగి ఫిట్‌గా అవుతాడనేది తెలియడంలేదు. మరోవైపు ప్రపంచ కప్ కోసం భారత జట్టులో టాప్ ఆర్డర్లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీల స్థానం స్థిరంగా ఉంది. నాలుగో నెంబర్ లో శ్రేయస్ లాంటి మంచి బ్యాట్స్…
ఐపీఎల్లో ఆడలేదని అభిమన్య ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్ లకు వెస్టిండీస్ టూర్ లో చోటు దక్కలేదని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆరోపించారు. దేశవాళీ క్రికెట్లో వారు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని వసీం తెలిపాడు. అయితే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత వన్డే, టెస్టు జట్టును నిన్న ప్రకటించారు. ఇప్పుడు జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా వార్నర్ రికార్డ్ నెలకొల్పాడు.
ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ఎడ్జ్ బాస్టన్ వేదికగా యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగులు చేసి స్టంపౌట్ గా పెవిలియన్ చేరాడు. జో రూట్ స్టంపౌట్ అవ్వడం ద్వారా రికార్డ్ నెలకొల్పాడు. కెరీర్ లో 130 టెస్టులు ఆడిన రూట్ స్టంపౌట్ అవ్వడం ఇదే తొలిసారి. దాంతో కెరీర్ లో 11,168 రన్స్ చేసిన తర్వాత స్టంపౌట్…
బెన్ఫికా స్టేడియంలో ఆదివారం జరిగిన UEFA యూరో క్వాలిఫయర్స్‌లో పోర్చుగల్ 3-0తో బోస్నియా అండ్ హెర్జెగోవినాను ఓడించింది. ప్రస్తుతం ఈ గెలుపుతో పోర్చుగల్ తొమ్మిది పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. మూడు గేమ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది.
ఈ వివాదంపై నవీన్ ఉల్ హక్ తాజాగా స్పందించాడు. తాను అసలు గొడవే పడలేదని, కోహ్లీనే గొడవ మొదలు పెట్టాడంటూ కీలక కామెంట్స్ చేశాడు.' మ్యాచ్ సమయంలో విరాట్ అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. నేను ఈ గొడవను ప్రారంభించలేదు. మ్యాచ్ అనంతరం మేం షేక్‌హ్యాండ్స్ ఇచ్చేటప్పుడు కోహ్లి మళ్లీ గొడవను ప్రారంభించాడు. మాపై పడిన ఫైన్లు చూస్తే మీరు చూస్తే తప్పు ఎవరిదో అర్థం అవుతుంది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.