భాగ్య నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పదుల సంఖ్యలో హత్యలు జరగడం నగర వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పాతకక్ష్యలతో ఒకరు, ఆస్తి కోసం మరొకరు.. డబ్బులు తిరిగి ఇవ్వనందుకు ఇంకొకరు.. ఇలా ఇతరత్రా కారణాలతో హత్యలు జరుతూనే వున్నాయి. పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న హత్యలకు తావులేకుండా పోతోంది. సికింద్రాబాద్ లోని లాలాగూడలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బోరబండకు చెందిన అఫ్సర్ అనే వ్యక్తిని మంగళవారం రాత్రి దుండగులు పొడిచి చంపారు. సమాచారం అందుకున్న…
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. పాత గొడవల కారణంగా వారసిగూడ పోచమ్మ ఆలయం వెనుక వీధిలో సాయంత్రం కొంతమంది యువకులు వచ్చి వీధిలో యువకులతో గొడవ పెట్టుకుని కర్రలతో దాడి చేసి హంగామా సృష్టించారు. కర్రలతో పాటు రాళ్లతో దాడి చేసి పూల కుండీలను ధ్వంసం చేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో స్థానికంగా ఉన్న మహిళలు డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాడి…
హైదరాబాద్ నగరంలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. నగరంలో నాలాల మరమ్మతుల కారణంగా నేటి నుంచి జూన్ 4 వరకు సికింద్రాబాద్ సీటీవో జంక్షన్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రసూల్‌పురా నాలా మరమ్మతుల కారణంగా.. సీటీవో జంక్షన్ నుంచి రసూల్‌పురా వెళ్లే వాహనాలను హనుమాన్ దేవాలయం నుంచి ఎడమ వైపునకు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రసూల్‌పురా నుంచి కిమ్స్ ఆస్పత్రి మీదుగా…
సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చింతచెట్టునుంచి మంటలు రావడంతో కలకలం రేగింది. జీడిమెట్ల 31 బస్ స్టాప్ వుండే పాలికా బజార్ లో భారీ చింత చెట్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున పొగలు చిమ్ముతోంది చింత చెట్టు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలీక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చింతచెట్టు లోలప మంటలు అంటుకొని పొగలు కక్కుతోంది. https://ntvtelugu.com/goa-driver-kidnap-case-what-happend/ పక్కనే ఉన్న ఇళ్లలోకి దట్టమైన పొగలు చేరుకుంటున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే…
వేసవి సందర్భంగా విహార యాత్రలకు వెళ్లే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందింది. రద్దీ దృష్ట్యా 104 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-ఎర్నాకుళం, మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతామని తెలిపింది. ఏప్రిల్ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీలలో సికింద్రాబాద్-ఎర్నాకుళం మధ్య (రైలు నంబర్ 07189) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ రైళ్లు…
దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. వివిధ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య నడిచే (నంబర్ 17230) రైలును మార్చి 5వ తేదీ నుంచి 16 వరకు మళ్లీ 18వ తేదీ నుంచి 21 వరకు దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలును కొట్టాయం, తిరువల్ల, చెంగనూరు, మవెలికర మీదుగా దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అటు తిరువనంతపురం-సికింద్రాబాద్ మధ్య నడిచే…
ఈనెల 17న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. సాంకేతిక కారణాలు, ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో పలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ జంట నగరాల పరిధిలో 79 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే అధికారులు నడుపుతున్నారు. అయితే ఈనెల 17న వాటిలో 36 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. Read Also: గోదారోళ్లతో మాములుగా ఉండదు… అల్లుడికి…
రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వ్యాప్తి పెరగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి ఎమర్జెన్సీ కానీ ఆపరేషన్లను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను సైతం విడుదల చేసింది. దీంతో గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కానీ ఆపరేషన్లు జరగవు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. Read Also: ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొరడా..నిబంధనలు…
దర్భంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ చార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది. హైదరాబాద్ కేంద్రంగా దర్భంగాలో ఈ పేలుడు జరిగింది. ఈ కేసులో ఎన్ఐఏ 5గురిపై అభిమోగాలు నమోదు చేసింది. నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్, సలీం అహ్మద్, కపిల్ అహ్మద్, ఇక్బాల్‌పై అభియోగాలను మోపారు ఎన్ఐఏ అధికారులు. సికింద్రాబాద్ నుంచి దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో బాంబులను పార్శిల్ చేశారు. ఈ సమయంలో దర్భంగా రైల్వే స్టేషన్లో పార్శిల్ బాంబు పేలింది. ఈ పేలుడుకు ముందు మాలిక్ సోదరులు పాకిస్తాన్లో శిక్షణ…
కరోనా తరువాత దాదాపు రెండేళ్ల తర్వాత కాలేజ్ పున:ప్రారంభం అయినప్పట్టికీ కాలేజ్‌లో ఉన్న సమస్యలపై ప్రన్సిపాల్ సిబ్బంది దృష్టి పెట్టలేదని, ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. కాలేజ్ సమస్యలపై అనేక సార్లు మెమొరాండం ఇచ్చినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టినందుకు ప్రిన్సిపాల్ బ్లాక్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కాలేజ్ ఆవరణలో ఎక్కడికక్కడ గడ్డి పేరుకుపోయి పాములు తిరుగుతున్నాయన్నారు. క్లాస్ రూంలో ఎలక్ట్రిసిటీ సమస్యలు, ఆట సామగ్రి, ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోవడం వంటి అనేక సమస్యలు…