Hyderabad : నిన్న బంజారాహిల్స్.. నేడు లాలాగూడ! నగరంలో ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్య నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పదుల సంఖ్యలో హత్యలు జరగడం నగర వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పాతకక్ష్యలతో ఒకరు, ఆస్తి కోసం మరొకరు.. డబ్బులు తిరిగి ఇవ్వనందుకు ఇంకొకరు.. ఇలా ఇతరత్రా కారణాలతో హత్యలు జరుతూనే వున్నాయి. పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న హత్యలకు తావులేకుండా పోతోంది.
సికింద్రాబాద్ లోని లాలాగూడలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బోరబండకు చెందిన అఫ్సర్ అనే వ్యక్తిని మంగళవారం రాత్రి దుండగులు పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని లాలాగూడలో పడేసినట్లు గుర్తించారు పోలీసులు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కాగా, 2017లో జరిగిన హత్యకేసులో అఫ్సర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని, ఇటీవలే జైలుకు వెళ్లివచ్చాడని తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే అతడిని చంపారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
అయితే.. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నీలోఫర్ కేఫ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిల్‌తో కడుపులో పొడిచి వ్యక్తిని హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో గొడవ.. ఆపై హత్య చేసి పరారై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా.. వరుస హత్యలతో నగరవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు ఏంజరుగుతుందో అంటూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి హత్యలు జరకుండా పకడ్భందీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!