సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. పాత గొడవల కారణంగా వారసిగూడ పోచమ్మ ఆలయం వెనుక వీధిలో సాయంత్రం కొంతమంది యువకులు వచ్చి వీధిలో యువకులతో గొడవ పెట్టుకుని కర్రలతో దాడి చేసి హంగామా సృష్టించారు. కర్రలతో పాటు రాళ్లతో దాడి చేసి పూల కుండీలను ధ్వంసం చేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో స్థానికంగా ఉన్న మహిళలు డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాడి చేసిన యువకులను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read Also: Tirumala: టీటీడీ స్క్రీన్ పై సినిమా పాటలు.. శ్రీవారి భక్తులు షాక్
ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన సాయికి వారసిగూడ ప్రాంతానికి చెందిన వంశీకి పాత గొడవలు ఉన్నాయి. పాత గొడవల కారణంగా ఈనెల 16న హనుమాన్ జయంతి రోజు గొడవ జరిగింది. గొడవను దృష్టిలో ఉంచుకున్న సాయి ఈరోజు మరికొంత మంది యువకులను తీసుకువచ్చి వంశీ ఇంటిపై దాడి చేశారు. ప్రక్కనే ఇంటి నిర్మాణం వద్ద ఉన్న కర్రలను తీసుకొని వంశీ అతని స్నేహితుల పై దాడి చేసి గాయపరిచారు. దీంతో వంశీతో పాటు మరో యువకుడికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు పోలీసులు. ఇరువర్గాల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చిలకలగూడ పోలీసులు.