రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వ్యాప్తి పెరగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి ఎమర్జెన్సీ కానీ ఆపరేషన్లను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను సైతం విడుదల చేసింది. దీంతో గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కానీ ఆపరేషన్లు జరగవు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొరడా..నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
అయితే గాంధీ ఆస్పత్రిలో అత్యవసర ఆపరేషన్లకు మాత్రం ఎలాంటి ఆటంకం ఉండదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గాంధీ ఆస్పత్రితలో ఇక నుంచి కరోనా సోకిన వ్యక్తులకు చికిత్స అందించడానికి వినియోగించే అవకాశం ఉంది. గాంధీ ఆస్పత్రిలో బెడ్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి కరోనా కేసులు పెరిగిన సమయాల్లో అత్యవసర పరిస్థితుల్లో దీనిని ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కాగా రాష్ట్రంలో కరోనా కేసులు ఈ మధ్య కాలంలో విపరీతంగా నమోదు అవుతున్నాయి. ఈ రోజు 1,920 కేసులు నమోదు అయ్యాయి. సోమవారం 1,825 కేసులు నమోదు అయ్యాయి. అలాగే గత కొద్ది రోజుల ముందు ఏకంగా 2,000 లకు పైగా కేసులు వచ్చాయి.