దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. వివిధ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య నడిచే (నంబర్ 17230) రైలును మార్చి 5వ తేదీ నుంచి 16 వరకు మళ్లీ 18వ తేదీ నుంచి 21 వరకు దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలును కొట్టాయం, తిరువల్ల, చెంగనూరు, మవెలికర మీదుగా దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అటు తిరువనంతపురం-సికింద్రాబాద్ మధ్య నడిచే (నంబర్ 17229) రైలును మార్చి 19 నుంచి 22 వరకు దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.