పెళ్లి పత్రికలో పేర్ల కోసం జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసిన ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.వివరాలలోకి వెళితే… మూడు రోజుల క్రితం చంద్రశేఖర్ నగర్ కు చెందిన సురేష్ వివాహం జరిగింది.. అయితే పెళ్లి పత్రికలలో తమ పేర్లు ఎందుకు పెట్టలేదని పెళ్లి రోజే సర్వేశ్ కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు..సురేష్…
హైదరాబాద్‌లో ఓ బాలుడు నాలాలో కొట్టుకుపోయి మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది.. దీంతో బోయిన్‌పల్లిలో విషాదం నెలకొంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ప్రమాదవశాత్తు చిన్నతోకట్ట నాలాలో పడిపోయాడే ఏడేళ్ల బాలుడు ఆనందసాయి.. నాలా నిర్మాణంలో ఉండగా.. ఇంటిముందు ఆడుకుంటుండగా అందులో పడిపోయాడు… విషయం తెలుకున్న స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినా.. ఆ బాలుడు ప్రాణాలు దక్కలేదు.. నాలాలో పడిపోయిన ఆ బాలుడు మృతదేహంగా…
సుప్రీంకోర్టు ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు.. అనంతరం రఘురామకు వైద్య పరీక్షలపై ఓ ప్రకటన విడుదల చేశారు.. ముగ్గురు డాక్టర్ల బృందంతో రఘురామ కృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించామని.. హైకోర్టు నామినేట్ చేసిన జ్యుడీషియల్ ఆఫీసర్ సమక్షంలో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందనీ.. పరీక్షలు మొత్తాన్ని వీడియో తీశామని పేర్కొన్నారు.. ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు మెడికల్ కేర్‌లో ఉన్నారని తెలిపిన ఆర్మీ ఆస్పత్రి……
గుంటూరు జిల్లా జైలు నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్‌కు తరలిస్తున్నారు పోలీసులు… సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి బయల్దేరారు.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత జిల్లా జైలు వద్దకు చేరుకున్న రఘురామకృష్ణంరాజు తరపు లాయర్లు.. ఆయనను ఎప్పుడు తరలిస్తారని చాలాసేపు ఎదురుచూశారు.. ఇక, రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ హాస్పటల్ కు తరలించే విషయంపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తో మాట్లాడారు అడ్వకేట్ లక్ష్మీనారాయణ… కోర్టు అదేశాలను తాము పాటిస్తామని అడ్వకేట్ కు స్పష్టం…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది… రఘురామకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించింది.. ఇక, ఈ సమయంలో రఘురామ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్టుగా భావించాలని సూచించింది.. తెలంగాణ హైకోర్టు ఒక జ్యుడీషియల్ అధికారిని నామినేట్ చేస్తుందన్న సుప్రీంకోర్టు.. ఆ జ్యుడీషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ.. ఏపీ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ హైకోర్టు రిజిస్టార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.…