సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట డివిజన్ బండ మైసమ్మనగర్‌లో రూ.27.20 కోట్ల వ్యయంతో 310 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. వాటిని మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేదల కలను ఒక్కరూపాయి ఖర్చు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని అన్నారు. కరోనా కారణంగా ఇండ్ల నిర్మాణం ఆలస్యం అయ్యిందని తెలిపారు.
ఎవరికి అన్యాయం జరుగకాకుండా లాటరీ పద్దతిలో లబ్ధిదారుల ఎంపిక చేస్తామని అన్నారు. గొప్ప మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కొనయాడారు. రాజకీయ నాయకులు ఎవడేవడో ఏమో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండాకాలం 24 గంటల కరెంటు ఎప్పుడైనా చూశామా? అంటూ ప్రశ్నించారు. కళ్ళుండి చూడలేక పోతున్నారు కొందరు రాజకీయ నాయకులంటూ మండి పడ్డారు.
అమిత్ షా పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్
కాగా.. అమిత్ షా పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. కళ్ళుండి చూడలేని కాబోదులు బీజేపీ నాయకులంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశ వ్యాప్త ఎన్నికలకు టిఆర్ఎస్ సిద్ధం మని సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నాం కదా ఏదైనా మాట్లాడుతమంటే చెల్లదని మండి పడ్డారు. కేంద్ర మంత్రి హోదాలో అమిత్ షా ఇలా మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి పదవులు అన్ని కేసీఆర్ కుటుంబానికి అన్న అమిత్ షా.. మిగతా మంత్రులకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దమ్ముంటే ఒకేసారి ఎన్నికలకు పోదాం, మీరు గెలుస్తారో, మేము గెలిస్తామో ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. గుజరాత్ లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. రాహుల్ గాంధీ కాశ్మీర్ టూ కన్యాకుమారి యాత్ర..!