వేసవి సందర్భంగా విహార యాత్రలకు వెళ్లే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందింది. రద్దీ దృష్ట్యా 104 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-ఎర్నాకుళం, మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతామని తెలిపింది. ఏప్రిల్ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీలలో సికింద్రాబాద్-ఎర్నాకుళం మధ్య (రైలు నంబర్ 07189) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ రైళ్లు రాత్రి 9:05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8: 15 గంటలకు ఎర్నాకుళం చేరుతాయి.
అటు ఏప్రిల్ నెలలో 2, 9, 16, 23, 30, మే నెలలో 7, 14, 21, 28, జూన్ నెలలో 4, 11, 18, 25 తేదీల్లో ఎర్నాకుళం-సికింద్రాబాద్ మధ్య (రైలు నంబర్ 07190) ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు రాత్రి 11:25 గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:30 గంటలకు సికింద్రాబాద్ చేరుతాయి.
ఏప్రిల్ నెలలో 2, 5, 7, 9, 12, 14, 16, 19, 21, 23, 26, 28, 30 తేదీల్లో, మే నెలలో 3, 5, 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, 31 తేదీల్లో, జూన్ నెలలో 2, 4, 7, 9 ,11, 14, 16, 18, 21, 23, 25, 28, 30 తేదీల్లో మచిలీపట్నం-కర్నూలు సిటీ మధ్య (రైలు నంబర్ 07067) ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు మధ్యాహ్నం 3:50 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:10 గంటలకు కర్నూలు సిటీ చేరుతాయి.
ఏప్రిల్ నెలలో 3, 6, 8, 10, 13, 15, 17, 20, 22, 24, 27, 29, మే నెలలో 1, 4, 6, 8, 11, 13, 15, 18, 20, 22, 25, 27, 29 తేదీల్లో, జూన్ నెలలో 1, 3, 5, 8, 10, 12, 15, 17, 19, 22, 24, 26, 29 తేదీల్లో, జూలై 1న కర్నూలు సిటీ-మచిలీపట్నం మధ్య (రైలు నంబర్ 07068) ప్రత్యేక రైళ్లను నడించనున్నారు. ఆయా రైళ్లు రాత్రి 8 గంటలకు కర్నూలు సిటీలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:05 గంటలకు మచిలీపట్నం చేరుకోనున్నాయి.
104 Weekly and Tri Weekly Special Trains between various destinations @drmsecunderabad @drmhyb @VijayawadaSCR pic.twitter.com/8l86sr2wOy
— South Central Railway (@SCRailwayIndia) March 19, 2022