తాము ఏమైనా ఉగ్రవాదులమా.. కాల్పులు జరపడానికి అంటూ ఆందోళనకారులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తే కాల్పులు జరుపుతారా అని మండిపడ్డారు. తమపై కాల్పులు జరపాలని ఎవరు ఆర్డర్ ఇచ్చారని ఆందోళనకారులు ప్రశ్నించారు. తమ నిరసనల్లో ఎలాంటి రాజకీయాలు లేవని, తమ న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ‘నాలుగు సంవత్సరాలుగా దీన్నే నమ్ముకొని ఉన్నాం. ఆందోళనల్లో రెండు బోగీలు తగలబడ్డాయంటున్నారు. మూడు…
నేడు దేశం అగ్నిపథ్‌తో అగ్ని గుండంలా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత్ రావు మండిపడ్డారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేస్తూ.. ఆయన శుక్రవారం మీడియాతో మాడారు. సైనికుల నియమకాలలో ‘‘అగ్నిపథ్’’ పేరుతో నాలుగేళ్లు సర్వీస్ పెట్టడం దారుణమని అన్నారు. నాలుగేళ్ల తర్వాత వారి జీవితాలకు భరోసా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 15 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఇచ్చేవారని గుర్తుచేశారు. సైనికులకు…
ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీస్ స్టేషన్ లో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని మండి పడ్డారు. సికింద్రాబాద్ లో జరిగిన విధ్వంసం పై స్పందిస్తూ.. సికింద్రాబాద్ లో రైల్వే బోగీలు తగులబెట్టడం, విధ్వంసాలు సృష్టించడంలో ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అగ్నిపథ్…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళన చేసేందుకు ఆర్మీ అభ్యర్థులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గురువారం రాత్రే యువకులు హైదరాబాద్‌కు తరలివచ్చారని.. జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకున్నట్లు తెలుసుకుని అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు తొలుత శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బయట ఓ బస్సు అద్దాలను ఆందోళనకారులు పగులగొట్టారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళనకారులు…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఆర్పీఎఫ్ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలయ్యాయి. మృతుడు వరంగల్‌కు చెందిన దామోదర్‌గా పోలీసులు గుర్తించారు. దామోదర్ మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ 8 మందికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ ఘటనతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు సికింద్రాబాద్ పరిధిలో 71 రైళ్లను రైల్వేశాఖ…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంపై కేటీఆర్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. దీనిని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. నాడు రైతులతో పెట్టుకున్నారని.. నేడు జవాన్‌లతో పెట్టుకున్నారని పేర్కొన్నారు. ‘అగ్నివీర్ స్కీమ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం. తొలుత దేశంలో రైతులతో పెట్టుకున్నారు. ఇప్పుడు దేశంలోని జవాన్ అభ్యర్థులతో పెట్టుకుంటున్నారు. వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ నుంచి ప్రతిపాదిత నో ర్యాంక్ – నో…
అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, ఆర్మీ అభ్యర్థులు నిర్వహిస్తోన్న ఆందోళనలు పలు చోట్ల హింసాత్మకంగా మారాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి తీసింది.. ఒక్కసారిగా రైల్వేస్టేషన్‌లోకి ఆందోళనకారులు చొచ్చుకురావడంతో పోలీసులు చేతులెత్తేశారు.. మొత్తంగా అగ్నిపథ్ పై ఆందోళనకారులు ఆగ్రహంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రణరంగంగా మార్చేశారు.. రైల్వేస్టేషన్‌లోని ఫర్నిచర్, సీసీ కెమెరాలు, ఏది కనిపించినా వదలకుండా ధ్వంసం చేశారు.. Read Also: Agneepath Scheme: సికింద్రాబాద్ విధ్వంసంపై స్పందించిన రేవంత్ ఇక,…
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన’అగ్నిపథ్’ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. అయితే ఈ ఘటనపై టీపీసీసీ రేవంత్ రెడ్డి స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితం ఇది అని మండిపడ్డారు. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని…
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన’అగ్నిపథ్’ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోనే కాకుండా..పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ లో నిరసనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. యూపీలోని బల్లియాలో నేటి ఉదయం కొంతమంది నిరసనకారులు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి పట్టాలపై ఆగిన రైళ్లకు నిప్పుపెట్టారు. స్టేషన్లోని ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే రైళ్లలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.…
అగ్నిపథ్ స్కీంకు సంబంధించిన అంశంపై ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు, స్టాళ్లకు నిప్పు పెట్టడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్త ఘటనల కారణంగా కేంద్రం ఆదేశాల మేరకు అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు…