అగ్నిపథ్ స్కీంకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ నుంచి ఆందోళనకారులు బయటకు వెళ్లకపోవడంతో ముందస్తు జాగ్రత్తగా స్టేషన్ నుంచి బయల్దేరాల్సిన అన్ని రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్‌కు రావాల్సిన కొన్ని రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలను అదుపులోకి తీసుకొస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిరసనకారులను బయటకు పంపించే ప్రయత్నం జరుగుతోందని, రైల్వే ఆస్తులకు ఎంతమేర నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమన్నారు. సికింద్రాబాద్ నుంచి…
అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకు దిగారు. బస్సులపై రాళ్లు రువ్వారు. స్టేషన్‌లో హౌరా ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పంటించారు. మొదటి మూడు ఫ్లాట్‌ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆర్మీ అభ్యర్థులు విధ్వంసంతో ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల నిరసనలతో రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది. అగ్నిపథ్ స్కీమ్ రద్దుచేయాలని, యధాతతంగా ఆర్మీ ఎగ్జామ్ పెట్టాల్సిందే అని డిమాండ్…
Agnipath Scheme Protest LIVE Updates: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పరిస్థితి చేయి దాటింది. ‘అగ్నిపథ్’ రద్దు చేసి, పాత పద్ధతిలో సైనికుల నియామకాలు జరపాలని డిమాండ్ చేస్తున్న వేలాది మంది యువకులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.
భారతీయ సైనిక దళాల నియామకాల్లో మార్పునకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో వద్ద ఆర్మీఅభ్యర్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. రైలు పట్టాల మధ్యలో నిప్పుపెట్టి ఆందోళన చేపట్టారు.…
హైదరాబాద్ మహానగరంలో దారుణాలు, దాడులు, అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో బాలికలపై వేధింపులు, అత్యాచారాలు జరగడం ఆందోళనకరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన మరవకముందే నగరంలో మరో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్ అక్కా(17) చెల్లెళ్లను(15) ఇద్దరు యువకులు మోసం చేశారు. ఈ ఘటన చిలకలగూడ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ చిలకలగూడలో మైనర్ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన ఘటనలో ఇద్దరు యువకులపై…
అతడు పాత నేరస్థుడు కాదు, అతనిపై కేసులు అస్సలు లేవు.. అక్కడేమి పెద్ద గొడవ కూడా కాలేదు. అస్సలు అతని తప్పేమీ లేదు. కేవలం తోపులాట. అయితే ఆ సీన్ ను ఓ సినిమాలో చూపించి నట్లుగా పోలీసులు వ్యవహరించారు. అవతలి వ్యక్తి ఫిర్యాదునే ప్రామాణికంగా తీసుకుని.. నిజానిజాలు పరిశీలించకుండా.. నేరం చేయని వాడిపై క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనను స్థానికుడు ఒకరు బాత్‌రూంలో ఉంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.…
అత్యవసర సర్వీసుల కోసం రైల్వే స్టేషన్స్‌లో అధికారులు ఉచిత ఇంటర్నెట్ సదుపాయాల్ని అమల్లోకి తీసుకొచ్చారు. అఫ్‌కోర్స్.. కాలక్షేపం చేసుకోవడానికి కూడా! కానీ, మొదటి ప్రియారిటీ మాత్రం ఎమర్జెన్సీ సర్వీస్ కోసమే! ఒకవేళ ప్రయాణికుల మొబైల్ నెట్ పని చేయని పక్షంలో, రైల్వే స్టేషన్‌లో ఉండే ఉచిత ఇంటర్నెట్ సేవలు అత్యవసర కార్యకలాపాల కోసం పనికొస్తుందని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ, మనోళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ‘చింతకాయల రవి’ సినిమాలో విక్టరీ వెంకటేశ్ తీరిగ్గా రకరకాల బూతు వెబ్‌సైట్స్‌ని…
అమ్మవారి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండి పడ్డారు. మహంకాళి అమ్మవారి విగ్రహం తప్పిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జులై 17, 18 తేదీల్లో ఘనంగా మహంకాళి జాతర ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి పనులను పరీశించారు. అనంతరం ఉజ్జయిని ఆలయ అధికారులతో…
టీఎస్‌ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీని లాభాల బాటలో తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే.. నిత్యం వాహనాల రద్దీతో పద్మవ్యూహాన్ని తలపించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులకు అతి పెద్ద ఊరట లభించనుంది. రైల్వేస్టేషన్‌కు నాలుగు వైపులా ఉన్న బస్టాపులను అనుసంధానం చేస్తూ మినీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఏర్పాటు చేశారు. కేవలం రూ.5…
సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట డివిజన్ బండ మైసమ్మనగర్‌లో రూ.27.20 కోట్ల వ్యయంతో 310 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. వాటిని మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేదల కలను ఒక్కరూపాయి ఖర్చు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని అన్నారు. కరోనా కారణంగా ఇండ్ల నిర్మాణం ఆలస్యం అయ్యిందని తెలిపారు. ఎవరికి అన్యాయం జరుగకాకుండా లాటరీ పద్దతిలో…