ICICI MD - CEO: దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీగా సందీప్ బక్షి నియామకానికి బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
RBI Data: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో నిరంతర క్షీణతకు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఈ ఏడాది సెప్టెంబరు 1తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 4 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీంతో ఫారెక్స్ నిల్వలు 598.897 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆగస్టు 25 నాటికి విదేశీ మారక నిల్వలు 594.85 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
UPI ATM: భారతదేశపు మొట్టమొదటి UPI ATM ప్రారంభించబడింది. హిటాచీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన హిటాచీ పేమెంట్ సర్వీసెస్ UPI ATMను ప్రారంభించింది. ఈ సదుపాయంతో ప్రస్తుతం ఏటీఎం కార్డు లేకుండా డైరెక్టుగా UPI ద్వారా ATM నుండి డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
93 percent 2000 Rupee Notes returned: రూ. 2 వేల నోట్లను తాత్కాలికంగా చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ఈ ఏడాది మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువునిచ్చింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఇక దీనికి సంబంధించే ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే 93 శాతం 2 వేల రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని స్పష్టంచేసింది. ఆగస్టు…
జులై నెలలో ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చినట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడానికి ఆహార ధరల పెరుగుదలే ప్రధాన కారణంగా ఆర్బీఐ భావించింది.
RBI: ప్రస్తుతం నిత్యవసరాల ధరలు నింగిని తాకుతున్నాయి. మొన్నటి వరకు టమాటా ధరలు చుక్కలు చూపించాయి. పప్పుధాన్యాల ధరలు కూడా రాకెట్ లా దూసుకుపోతున్నాయి. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో ఏమి కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతొ దేశంలో ద్రవోల్బణం కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇది ఆర్థికాభివృద్దికి అంతమంచిది కాదు. ఈ నేపథ్యంలో సామాన్యులకు ఊరట కలిగే ఒక విషయాన్ని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. సెప్టెంబర్ నుంచి…
డబ్బును సేఫ్ గా ఉంచుకోవడానికి మంచి ఉపాయం బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం. అయితే ఎఫ్ డీ చేసే ముందు మనం ఏఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లను అందిస్తున్నాయో తెలుసుకొని ఎఫ్ డీ చేస్తే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. బ్యాంక్ లు కూడా తరచూ వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటాయి. సాధారణంగా ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించే రెపో రేటు, రివర్స్ రెపోరేటుపై ఆధారపడి ఉంటాయి. అయితే కొద్దిరోజుల కిందట ఆర్బీఐ…
బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్షియల్ సంస్థల నుంచి లోన్ తీసుకోవాలంటే తల ప్రాణం తోకకు రావాల్సిందే. రకరకాల ప్రాసెస్ లు పూర్తి చేయాలి, డాక్యుమెంట్లు సమర్పించాలి. దీనికి తోడు లోన్ ఇచ్చే కంపెనీలు అడిగిన సమాచారాన్ని అందించాలి. అన్నీ సరిగ్గా ఉన్నా వెరిఫై చేసి లోన్ రావడానికి ఎక్కువ సమయమే పడుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో కారణంతో లోన్ రిజక్ట్ కూడా కావచ్చు. ఇకపై ఈ ప్రాసెస్ లకు ఫుల్ స్టాప్ పెట్టి లోన్లను సులభంగా…
UPI in Other Countries: భారతదేశ దేశీయ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూపీఐ కోసం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల చాలా దేశాలు యూపీఐని స్వీకరించాయి. ఇప్పుడు జపాన్, అనేక పాశ్చాత్య దేశాలు యూపీఐ లింకేజీపై ఆసక్తి చూపుతున్నాయి.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) హోమ్ లోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారి హోమ్‌లోన్ ఫిక్స్డ్ వడ్డీ రేట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించింది.