Rs.2000 Notes: సెప్టెంబర్ నెల ముగియడానికి, రూ.2000 నోటు పూర్తిగా కనుమరుగు కావడానికి ఇంకా ఒకరోజే మిగిలి ఉంది. రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించడంతోపాటు ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30వ తేదీని తుది గడువుగా విధించిన సంగతి తెలిసిందే. ఈ తేదీ అనంతరం రూ.2వేల నోటు చెల్లకుండా మిగిపోతుంది. అయితే, ఇప్పటికే ఆ నోటును ప్రజలు బ్యాంకులలో జమచేశారు. ఇతరత్రా లావాదేవీల ద్వారా మార్పిడి చేసుకున్నారు. అయినా ఈ నోట్ల మార్పిడి విషయంలో కొందరు ఏమరుపాటుగా ఉన్నారని, అలాంటి వారు శనివారం లోగా మార్చుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు.
మే 19, 2023 న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలోనే అతిపెద్ద కరెన్సీ నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది, అంటే రూ. 2,000 నోటును చెలామణి నుంచి తీసివేసింది. మార్కెట్‌లో ఉన్న ఈ నోట్లను తిరిగి ఇచ్చే సదుపాయాన్ని కల్పిస్తూ, ఆర్‌బీఐ బ్యాంకుల ద్వారా రిటర్న్ చేయడానికి లేదా మార్పిడికి సెప్టెంబర్ 30 తేదీని నిర్ణయించింది. రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినప్పుడు, ఆర్బీఐ ప్రకారం, మార్చి 31, 2023 వరకు రూ.3.62 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయని తెలిపింది.
సెప్టెంబర్ ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన డేటా ప్రకారం.. ఆగస్టు 31 వరకు, మొత్తం చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో 93 శాతం ఆర్బీఐకి తిరిగి వచ్చాయి. అదే సమయంలో సెప్టెంబర్ ప్రారంభం వరకు దాదాపు రూ.24,000 కోట్ల విలువైన నోట్లు మార్కెట్‌లో ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఇటీవల ఎటువంటి డేటాను విడుదల చేయనప్పటికీ, ఇందులో కొంత భాగాన్ని ఇతర బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఉండవచ్చు. అయితే ఇప్పటికీ ఈ నోట్లు ఉన్నవారు ఉన్నవారు రేపు బ్యాంకు లేదా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం ద్వారా ఇతర నోట్లతో మార్చుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు.
Also Read: Home Loan Scheme: నగరాల్లో నివసించే నిరుపేదలకు శుభవార్త.. చౌకగా గృహరుణాలు!
గడువు పొడిగిస్తారా?
సాధారణంగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసినా లేదా నామినీ పేరును డీమ్యాట్‌తో లింక్ చేసినా, అటువంటి ఫైనాన్స్ సంబంధిత పనుల కోసం గడువును పొడిగించడం ద్వారా ప్రజలకు ఉపశమనం లభించింది. అయితే రూ.2,000 నోట్ల గురించి మాట్లాడితే దాని గడువును పొడిగిస్తారనే ఆశ కనిపించడం లేదు. దేశంలో ప్రస్తుతం ఉన్న రూ.2000 నోట్లు చాలా వరకు తిరిగి రావడమే దీనికి కారణం. అయితే ఆర్బీఐ ఈ పని కోసం గడువును పొడిగిస్తారా లేదో అనేది వేచి చూడాల్సిందే. అయితే వరుసగా బ్యాంకుకు సెలవులుండటంతో ఆర్బీఐ మరోనెల పొడిగించే అవకాశం ఉన్నట్లు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.