UPI ATM: ఇకనుంచి ఏటీఎంకు కార్డు తీసుకెళ్లే పనిలేదు.. యూపీఐ ఉంటే చాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI ATM: భారతదేశపు మొట్టమొదటి UPI ATM ప్రారంభించబడింది. హిటాచీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన హిటాచీ పేమెంట్ సర్వీసెస్ UPI ATMను ప్రారంభించింది. ఈ సదుపాయంతో ప్రస్తుతం ఏటీఎం కార్డు లేకుండా డైరెక్టుగా UPI ద్వారా ATM నుండి డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. భారతదేశంలోని ప్రజలకు ఈ సౌకర్యాన్ని అందించడానికి ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో UPI ATM వైట్ లేబుల్ ATM (WLA)గా పరిచయం చేయబడింది. ఈ ATM వినియోగదారులు బహుళ ఖాతాల నుండి UPI యాప్ ద్వారా చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది.
మోసాలకు చెల్లు చీటి
ఇది నాన్ బ్యాంకింగ్ సంస్థలచే నిర్వహించబడుతుంది. ఇది కొత్త అనుభూతిని అందించడమే కాకుండా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు, విత్‌డ్రా పరిమితిని కూడా పెంచుతుంది. అదనంగా, UPI ATMలు కార్డ్ స్కిమ్మింగ్ వంటి ఆర్థిక మోసాలను నిరోధించడానికి సానుకూల చర్యగా పరిగణించబడుతుంది.
Also Read
Read Also:Aditya-L1: ఆదిత్య ఎల్ 1 సెల్ఫీ.. భూమి, చంద్రుడు ఎలా ఉన్నారో చూడండి..
UPI ATM ఎలా పని చేస్తుంది ?
ముంబై గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో రవిసుతంజని కుమార్ వీడియో డెమోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిలో UPI ATM టచ్ ప్యానెల్‌గా చూడవచ్చు. కుడి వైపున ఉన్న UPI కార్డ్‌లెస్ క్యాష్‌పై నొక్కడం ద్వారా రూ. 100, రూ. 500, రూ. 1000, రూ. 2000, రూ. 5000.. ఇతర మొత్తాల వంటి నగదు మొత్తం ఎంపిక కోసం బటన్‌తో మరొక విండో ఓపెన్ అవుతుంది. దాన్ని ఎంచుకున్న తర్వాత, QR కోడ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
🚨 ATM Cash Withdrawal using UPI
Today I Made a Cash Withdrawal using UPI at Global FinTech Fest in Mumbai
What an Innovative Feature for Bharat pic.twitter.com/hRwcD0i5lu
— Ravisutanjani (@Ravisutanjani) September 5, 2023
ఇప్పుడు మీరు ఏదైనా UPI యాప్‌ని ఉపయోగించి స్కాన్ చేయాలి. కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత, వినియోగదారులు తమకు కావాల్సిన బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి. తర్వాత కన్ఫర్మ్‌పై క్లిక్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు మీరు ఎంత నగదు విత్ డ్రా చేసుకోవాలో నిర్ధారించుకోవాలి. దీని తర్వాత UPI పిన్ నమోదు చేయాలి. ఇలా చేసిన తర్వాత లావాదేవీ జరగబోతోందని UPI మెసేజ్ పంపబడుతుంది. దీని తర్వాత ATM మీ డబ్బును విత్‌డ్రా చేస్తుంది. UPI ATM ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నిర్మించబడింది. ప్రస్తుతానికి హిటాచీ పేమెంట్ సర్వీసెస్ మాత్రమే WLA ఆపరేటర్. ఇది నగదు డిపాజిట్లను కూడా అందిస్తుంది. 3000 పైగా ATM స్థానాల నెట్‌వర్క్‌కు యాక్సెస్‌ను కలిగి ఉంది.
Read Also:Babar Azam: విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?