2000 Notes Exchange: 2000 నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే సమయం.. త్వరగా మార్చుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లను మార్చుకునే సమయం త్వరలో ముగియనుంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ పెద్దనోట్లను మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డెడ్ లైన్ విధించింది. అయితే ఇంకెంతో సమయం లేదు.. కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా 2000 రూపాయల నోట్లను మార్చుకోకపోతే.. వెంటనే మీ దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి నోట్లను మార్చుకోండి. అక్కడైతేనే ఈ నోట్లను మార్చుకునేందుకు వీలుంటుంది.
Vishwak Sen :ఆంజనేయ మాలలో విశ్వక్ సేన్.. ఫోటోలు వైరల్..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఆర్బీఐ ఆదేశాల మేరకు.. ఎలాంటి పత్రాలు లేకుండా రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకుంటున్నప్పటికీ.. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు గుర్తింపు కార్డులను అడుగుతున్నాయి. అందుకోసమని మీరు బ్యాంకుకు వెళ్లినప్పుడు మీ వెంట గుర్తింపు కార్డును తీసుకువెళ్లండి. మరోవైపు నోట్ల మార్పిడి కోసం RBIతో సహా దేశంలోని అన్ని బ్యాంకుల్లో సౌకర్యం అందుబాటులో ఉంది.
ఇదిలా ఉంటే.. నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వెళ్లే ముందు.. ఒకసారి సెలవు జాబితాను తనిఖీ చేయాలి. సెప్టెంబర్ 25 నుండి 27 వరకు అంటే సోమవారం నుండి బుధవారం వరకు బ్యాంకులు తెరిచి ఉంటాయి. గురువారం మిలాద్-ఉల్-నబీ సందర్భంగా బ్యాంకులకు హాలిడే ప్రకటించారు. శుక్ర, శనివారాల్లో సాధారణ సమయాల ప్రకారం బ్యాంకులు తెరవబడతాయి. రూ.2000 నోట్లను మార్చుకోవడానికి 25 నుండి 27, 29 నుండి 30 వరకు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి త్వరగా నోట్లను మార్చుకోండి.
PM Modi: కాంగ్రెస్ తుప్పుపట్టిన ఇనుము లాంటింది.. మధ్యప్రదేశ్‌లో ప్రధాని మోడీ
2016 నవంబర్ నుంచి రూ.2000 నోటును చలామణిలోకి తీసుకొచ్చారు. అదే సమయంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఇకపోతే సెప్టెంబర్ 30 నుంచి రూ.2000 నోట్లు చెల్లుబాటు కావు. మే మూడో వారంలో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం సెప్టెంబరు 30వ తేదీ వరకు గడువు విధించి బ్యాంకులకు వెళ్లి నోట్లను మార్చుకోవాలని ఆర్బీఐ కోరింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!