India's defence: భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత పెంపొందించేలా, ఢిపెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) ₹ 84,560 కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపానదల్లో యాంటి ట్యాంక్ మైన్స్, హెవీ వెయిట్ టార్పిడోలు, మల్టీ మిషన్ మారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్లు ఉన్నాయి. వీటికి రక్షణ మంత్రి శాఖ అనుమతి లభించింది. కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ కొనుగోళ్లకు శుక్రవారం పచ్చజెండా ఊపింది.
విశాఖలో ఐఎన్‌ఎస్ సంధాయక్ సర్వే నౌకను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. విశాఖలోని నేవల్ డాక్ యార్డులో తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో ఐఎన్‌ఎస్ సంధాయక్ సర్వే నౌకను కేంద్ర మంత్రి జాతికి అంకితమిచ్చారు. నేవీ అవసరాల కోసం ఐఎన్‌ఎస్ సంధాయక్ సర్వే నౌకను ఉపయోగించనున్నారు.
Rajnath Singh: చైనాను ఉద్దేశించి భారత్ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాలో మాట్లాడుతూ.. 2020 గల్వాన్ ఘటన తర్వాత భారత్ ఏంటో చైనాకు అర్థమైందని అన్నారు. భారత్ ఇప్పుడు వ్యూహాత్మకంగా ఉందని, బలహీనమైన దేశం కాదని చెప్పారు. భారత దేశాన్ని ఎవరూ భయపెట్టి తప్పించుకోలేరని అన్నారు.
Rajnath Singh: టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవ్వాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఇవాళ ఉదయం దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది.
High-Speed Flying-Wing UAV: డీఆర్డీవో శుక్రవారం కర్ణాటకలోని చిత్రదుర్గలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR) నుండి అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌ను విజయవంతంగా పరీక్షించింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య భారత్- అమెరికాల 5వ ‘టూ ప్లస్ టూ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంలో ఇరు దేశాలు ఇజ్రాయెల్‌కు బహిరంగంగా మద్దతు తెలిపాయి.
India-USA: భారత్, అమెరికా మధ్య ఈ రోజు ఇరు దేశాల 2+2 మంత్రుల సమావేశం జరిగింది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగమంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడేలా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి.
Women Soldiers: మహిళా సైనికులకు కేంద్ర గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా సైనికులకు, నావికులకు, వైమానిక దళాల్లో పనిచేసే మహిళలకు వారి అధికారులతో సమానంగా ప్రసూతి, శిశు సంరక్షణ, పిల్లల దత్తత సెలవులకు కేంద్రం ఓకే చెప్పింది. సెలవులు మంజూరు చేసే ప్రతిపాదనకరు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ర్యాంకులో సంబంధం లేకుండా సాయుధ దళాల్లోని మహిళలందరిని సమానంగా చూడాలనే దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.
Rajnath Singh: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని గురుద్వారా అలంబాగ్‌లో శనివారం జరిగిన గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు సమాజాన్ని ఉద్దేశిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమోధ్యలో రామమందిరం కోసం దేశంలోని సిక్కు సమాజం ఉద్యమాన్ని ప్రారంభించిందని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు సమాజం ఎంతో కృషి చేసిందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.