Rajnath Singh: టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవ్వాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఇవాళ ఉదయం దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యువ పైలట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సైనికాధికారుల విన్యాసాలను వీక్షించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లను అభినందించారు. మీరు క్యాడెట్‌లుగా ఉన్నప్పుడు మీరంతా విద్యార్థులుగా ఉండి శిక్షణ పొందుతారని అన్నారు. అయితే ఈరోజు నుంచి మీరు అధికారులుగా మారబోతున్నారని తెలిపారు.
Read also: Jagga Reddy: అనుభవాలు చాలా నేర్చుకున్న.. సంగారెడ్డి ప్రజలు 5 ఏళ్లు రెస్ట్ ఇచ్చారు..!
మీ బాధ్యత మరింత పెరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. శిక్షణ రోజులలో, మీరు మీ తల్లిదండ్రులు, కుటుంబం మరియు స్నేహితులకు దూరంగా ఉంటారు. ఈరోజుతో మీ శిక్షణ ముగిసిందని, అయితే మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. దేశ గౌరవం, దేశ భద్రత మీపైనే ఉంటుందని, కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. సంప్రదాయం, ఆవిష్కరణలు కలగలిసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సంప్రదాయాలను గౌరవించాలని యువ పైలట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన 212 మంది యువ పైలట్లు పాల్గొన్నారు. కాగా.. పిలాటస్ పీసీ-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్-30, సారంగ్ హెలికాఫ్టర్లతో చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
Nagpur: సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలుడు.. తొమ్మది మంది మృతి