India’s defence: భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత పెంపొందించేలా, ఢిపెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) ₹ 84,560 కోట్ల విలువైన కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపానదల్లో యాంటి ట్యాంక్ మైన్స్, హెవీ వెయిట్ టార్పిడోలు, మల్టీ మిషన్ మారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్లు ఉన్నాయి. వీటికి రక్షణ మంత్రి శాఖ అనుమతి లభించింది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ కొనుగోళ్లకు శుక్రవారం పచ్చజెండా ఊపింది.
Read Also: Breaking News: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవెల్నీ జైలులో మృతి..
ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ నిఘాను మరింతగా పెంచడానికి ఈ కొనుగోళ్ల సహకరిస్తాయి. వాయు రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసే లక్ష్యంతో వాయు రక్షణ వ్యూహాత్మక నియంత్రణ రాడార్‌ను కొనుగోలు చేసే ప్రతిపాదన కూడా ఆమోదించబడింది. ముఖ్యంగా నెమ్మదిగా తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను గుర్తించే సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా భారతీయ విక్రేతల నుంచి పరికరాలను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
నీటి అడుగున లక్ష్యాలను గుర్తించి, నిర్వీర్యం చేయడానిరి యాక్టివ్ టోవ్డ్ అర్రే సోనార్, హెవీ వెయిట్ టార్పిడోలను కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోళ్లు ద్వారా నౌకాదళ ఆస్తుల్ని, ముఖ్యంగా కల్వరీ క్లాస్ జలంతర్గాములను గుర్తించి దాడి చేసే సామర్థ్యం పెరుగుతుంది. సముద్ర నిఘా కోసం 15 సముద్ర గస్తీ విమానాలను కొనుగోలు చేయనున్నారు. మేడ్ ఇన్ ఇండియా సి-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 15 సముద్ర గస్తీ విమానాలను నిర్మించనున్నామని, ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.29,000 కోట్లు అని రక్షణ శాఖ తెలిపింది. ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డు కోసం దేశీయంగా నిర్మించిన 12.7 మిల్లీమీటర్ల రిమోట్ కంట్రోల్ తుపాకుల తీయారీకి కాన్పూర్‌కి చెందిన సంస్థతో రూ. 1,752.13-కోట్ల ఒప్పందంపై జరిగింది.