INS Sandhayak: విశాఖలో ఐఎన్‌ఎస్ సంధాయక్ సర్వే నౌకను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. విశాఖలోని నేవల్ డాక్ యార్డులో తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో ఐఎన్‌ఎస్ సంధాయక్ సర్వే నౌకను కేంద్ర మంత్రి జాతికి అంకితమిచ్చారు. నేవీ అవసరాల కోసం ఐఎన్‌ఎస్ సంధాయక్ సర్వే నౌకను ఉపయోగించనున్నారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే సరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ ఐఎన్‌ఎస్ సంధాయక్‌ను నిర్మించింది. ఈ ఐఎన్‌ఎస్ సంధాయక్ నౌక 3,800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుతో.. హెలిపాడ్, సర్వే పరికరాలు, రెండు డీజిల్ యంత్రాలను కలిగి ఉంది.
Read Also: Advani: అద్వానీకి భారతరత్న
తాజాగా ఐఎన్‌ఎస్ సంధాయక్ నౌకను రాజ్‌నాథ్ సింగ్ అంకితమిచ్చారు. సంధాయక్ నౌకకు కమాండింగ్ అధికారిగా కెప్టెన్ ఆర్.ఎం.థామస్ వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి, వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్క పాల్గొన్నారు. భారత నౌకాదళ అమ్ములపొదిలో ఐఎన్‌ఎస్ సంధాయక్ జలప్రవేశం సంతోషకరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత నౌకాదళం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు. ప్రపంచ సముద్ర జలాల్లో కూడా భారత నౌకాదళం కీలక భద్రత చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్‌కు 8 వేల నాటికల్ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలను కూడా నౌకాదళం అదుపు చేసిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత నౌకాదళానికి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనది. హిందూ మహాసముద్ర జలాల్లో శాంతిని కాపాడేందుకు ఐఎన్ఎస్ సందాయక్ ఉపకరిస్తుంది. దేశీయంగా యుద్ధ నౌక తయారీలో చరిత్ర సృష్టించడం ఆనందంగా వుంది. ఇటీవల రెండు విదేశీ నౌకలను సముద్రంలో వేలమైళ్ల దూరంలో సముద్రపు దొంగల బారిన, వారి చెర నుంచి కాపాడిన ఘనత భారత నౌకా దళానిది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా తిరిగిందుకు భారత నౌకలు తన వంతుగా పూర్తి సహకారాన్ని అందరికీ అందిస్తుంది.హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలకు అవసరమైన భద్రతను ఇండియన్ నేవీ కల్పిస్తోంది. భారతదేశం ప్రధానమైన లక్షమైన శాంతి సామరస్యం అంతర్జాతీయ జలాల్లో కూడా ఇది కాపాడే విధంగా భారత తన వంతు పాత్రను సహకారాన్ని పోషిస్తుంది. మన విజ్ఞానమే మన శక్తి. ఇదే అన్ని రంగాల్లోనూ మనం నిరూపిస్తున్నాం.” అని రక్షణ మంత్రి అన్నారు.