Women Soldiers: మహిళా సైనికులకు కేంద్ర గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా సైనికులకు, నావికులకు, వైమానిక దళాల్లో పనిచేసే మహిళలకు వారి అధికారులతో సమానంగా ప్రసూతి, శిశు సంరక్షణ, పిల్లల దత్తత సెలవులకు కేంద్రం ఓకే చెప్పింది. సెలవులు మంజూరు చేసే ప్రతిపాదనకరు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ర్యాంకులో సంబంధం లేకుండా సాయుధ దళాల్లోని మహిళలందరిని సమానంగా చూడాలనే దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.
Rajnath Singh: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని గురుద్వారా అలంబాగ్‌లో శనివారం జరిగిన గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు సమాజాన్ని ఉద్దేశిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమోధ్యలో రామమందిరం కోసం దేశంలోని సిక్కు సమాజం ఉద్యమాన్ని ప్రారంభించిందని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు సమాజం ఎంతో కృషి చేసిందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితిని అంచనా వేయాలని, భారత వైమానిక రక్షణ వ్యవస్థల పటిష్టతపై వైమానిక దళం దృష్టి పెట్టాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం టాప్ కమాండర్లను కోరారు.
విజయదశమి సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్ర పూజలు చేశారు. అనంతరం సైనికులతో కలిసి విజయదశమి వేడుకలు జరుపుకున్నారు. తవాంగ్ చేరుకోవడానికి ముందు రక్షణ మంత్రి అస్సాంలోని తేజ్‌పూర్ లో సైనికులతో ముచ్చటించారు. అన్ని స్థాయిల సైనికులు ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి భోజనం చేస్తారనే భావనను ప్రశంసించారు.
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. అయితే.. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. breaking news, latest news, telugu news, big nes, harish rao, rajnath singh
సభలకు హాజరవుతున్న ప్రజలను చూస్తుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టమవుతోందని కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. మహేశ్వరంలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు.
బీజేపీకి తెలంగాణ అండగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.
భారత దేశ అభివృద్ధిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే భారత్‌కు ఆధునిక పరికరాలతో కూడిన బలమైన సాయుధ బలగాలు అవసరమని రక్షణ మంత్రి ఆదివారం పేర్కొన్నారు. మూడు సేవల ద్వారా ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు.
MP Ramesh Bidhuri: రాజ్యసభలో గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతుండగా.. లోక్‌సభలో చంద్రయాన్-3 విజయంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ రమేష్ బిధూరి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర ప్రకటన చేశారు.
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన మహిళా శాస్త్రవేత్తలకు కృతజ్ఞతతో కూడిన దేశం అందించిన బహుమతి అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. breaking news, latest news, telugu news, rajnath singh, nari shakti vandan