ఇప్పటికే ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించి కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించారు.. రేపు మరోసారి ఏపీకి రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే, ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏపీలో పర్యటించబోతున్నారు.
సముద్రంలో బలాన్ని పెంచుకునేందుకు భారత నావికాదళం సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో (స్మార్ట్) వ్యవస్థ కోసం భారత్ విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించింది. బుధవారం ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి 'SMART' వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. SMART అనేది తరువాతి తరం క్షిపణి-ఆధారిత తేలికపాటి టార్పెడో డెలివరీ సిస్టమ్.. ఇది తేలికపాటి టార్పెడోల యొక్క సాంప్రదాయ శ్రేణికి మించి భారత నావికాదళం యొక్క యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి…
Rajput Issue:రాజ్‌పుత్ వర్గం బీజేపీపై మండిపడుతోంది. అయితే, ఈ కోపాన్ని తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. క్షత్రియ సామాజికవర్గంలో బీజేపీపై నెలకొన్న కోపాన్ని తగ్గించేందుకు పార్టీ అగ్రనేతలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జరిగిన ర్యాలీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు భారత్‌తో కలిసి జీవించాలని డిమాండ్ చేస్తారని అన్నారు.
Rajnath Singh : దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం సియాచిన్‌ను సందర్శించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో మోహరించిన సైనికులతో సంభాషించనున్నారు.
Rajnath Singh: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మమతా బెనర్జీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఆదివారం పశ్చిమబెంగాల్ లోని ముర్షిదాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘‘రాష్ట్రంలో అరాచక వాతావరణ నెలకొందని, నేరాలకు ప్రసిద్ధి చెందిందని, ఈ గడ్డపై సందేశ్ ఖాలీ లాంటి ఘటనలు జరిగాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ఆభ్యర్ధి తాండ్ర వినోద్ రావు గెలుపును కాంక్షిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రోడ్ షో నిర్వహించారు.
Rajnath Singh: బీజేపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేదని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కిషన్ రెడ్డి ఎంపీ అయ్యాక సికింద్రాబాద్ ఎలా డెవలప్మెంట్ అయ్యిందో చూస్తున్నామని తెలిపాడు.
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్జేడీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్నవారు, బెయిల్‌పై ఉన్నవారు ప్రధాని నరేంద్రమోడీని జైలుకు పంపాలని మాట్లాడుతున్నారని, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసాభారతీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.