Explosion On Train Track: రాజస్థాన్ రైల్వే ట్రాకుపై పేలుడు సంభవించింది. అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అసర్వా-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లడానికి గంటల ముందు, ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే దీంట్లో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయపూర్‌లోని జావర్ మైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెవ్డా కి నాల్ సమీపంలోని ఓధా వంతెనపై ట్రాక్‌లను దెబ్బతీయడానికి మైనింగ్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.
Congress Plans East-West Bharat Jodo-Like Yatra Before 2024 Polls: కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురావడానికి ఆ పార్టీ ‘‘భారత్ జోడో యాత్ర’’ను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగుతోంది. మొత్తం 3570 కిలోమీటర్ల మేర 5 నెలల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. జమ్మూ కాశ్మీర్ తో ఈ యాత్ర ముగుస్తోంది. ఇప్పటికే తమిళనాడు,…
ఓ యువతి లింగమార్పిడి చేసుకుని యువకుడిలా మారింది. అనంతరం పెద్దల అనుమతితో మరో యువతిని పెళ్లిచేసుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పుర్ జిల్లాలో జరిగింది.
బర్మా జిల్లాలో ఓ వృద్ధుడు బెంచీపై కూర్చుని దినపత్రిక చదువుతుండగా కుప్పకూలిపోయాడు. అకస్మాత్తుగా ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పచ్చపద్రలోని ఓ క్లినిక్ రిసెప్షన్‌లోని బెంచ్‌పై కూర్చుని న్యూస్ పేపర్ చదువుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు.
సాంకేతికత విపరీతంగా పెరిగిన ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలతో కొందరు మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ మూర్ఖత్వం ఎంతలా అంటే సొంత కూతురినే చంపుకునేంత. అవునండీ.. మూఢనమ్మకంతో ఓ తల్లి కొడుకు కోసం కూతురినే చంపుకుంది.
ఈ మధ్యం ఎక్కడ ఏ పని చేయించుకోవాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో న్యాయంగా ఏదైనా పని చేయించుకోవాలంటే చెప్పులు అరిగేలా తిరగాల్సిందే. అదే లంచం ఇస్తే వెంటనే పని పూర్తయిపోతుంది. కొన్నిసార్లు అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కుతుంటారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మరోసారి తన వ్యతిరేక గళం వినిపించారు.
రాజస్థాన్‌లోని రాజసమంద్ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల ఎత్తైన మహాశివుడి విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన కైలాసనాథుడి విగ్రహాన్ని నేడు ప్రారంభించనున్నారు.
రాజస్థాన్ కు చెందిన అమిత్ శర్మ అనే యూట్యూబర్ తన ఛానెల్లో వివిధ రకాల వీడియోలను చేయడంలో చాలా ఫేమస్ అయ్యాడు. తాజాగా అలాంటి వీడియోనే రికార్డ్ చేశాడు, ఇది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అతను చేసిన పని అందిరినీ విస్తుపోయేలా, మైండ్ బ్లాంక్ అవుతుంది. అమిత్ శర్మ తన కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. అయితే.. కారు ముందున్న గ్లాస్‌పై మాత్రం టపాసులు పెట్టలేదు.
Jio 5G: రిలయెన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ ఇవాళ రాజస్థాన్‌లో జియో 5జీ బీటా సర్వీసులను ప్రారంభించారు. రాజ్‌సమంద్‌లోని నాథద్వారాలో ఉన్న ప్రసిద్ధ శ్రీనాథ్జీ ఆలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబానీలకు ఈ దేవుడి పైన అపార నమ్మకం ఉంది. శ్రీనాథ్జీని తమ కుటుంబ దైవంగా కొలుస్తారు. గతంలో రిలయెన్స్ జియో 4జీ సర్వీసులను సైతం ఇక్కడే ప్రారంభించటం విశేషం.