Teachers Changes Gender: ఓ యువతి లింగమార్పిడి చేసుకుని యువకుడిలా మారింది. అనంతరం పెద్దల అనుమతితో మరో యువతిని పెళ్లిచేసుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పుర్ జిల్లాలో జరిగింది. రాజస్థాన్‌లోని ఓ స్కూల్ టీచర్ తన లింగాన్ని మార్చుకుని తన విద్యార్థినిని ఆదివారం పెళ్లి చేసుకుంది. భరత్‌పూర్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ) అయిన మీరా, కల్పనా ఫౌజ్‌దార్‌తో ప్రేమలో పడింది. ఆమెను వివాహం చేసుకోవడానికి లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని పెళ్లి చేసుకుంది. కబడ్డీ నేషనల్ ఛాంపియన్ అయిన మీరా కుంతల్ లింగ మార్పిడి అనంతరం ఆరవ్ కుంతల్‌గా పేరు మార్చుకుంది. ప్రేమలో ప్రతిదీ న్యాయమే, అందుకే తాను లింగాన్ని మార్చుకున్నానని ఆరవ్ కుంతల్ విలేకరులతో అన్నారు.ఆరవ్ కుంతల్(లింగమార్పిడి చేయించుకున్న మీరా) స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసుల సమయంలో కల్పనను కలిశారు. కల్పన రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ఆడింది. జనవరిలో జరిగే అంతర్జాతీయ కబడ్డీ టోర్నమెంట్ కోసం దుబాయ్ వెళ్లనున్నట్లు సమాచారం.
స్కూల్ ప్లేగ్రౌండ్‌లో తమ పరస్పర చర్యల సమయంలో కల్పనతో తాను ప్రేమలో పడ్డానని, అయితే అతను ఎప్పటినుండో అబ్బాయిగా ఉండాలని కోరుకుంటున్నానని ఆరవ్ చెప్పాడు. “నేను ఆడపిల్లగా పుట్టాను కానీ ఎప్పుడూ అబ్బాయినే అనుకునేవాడిని. నా లింగాన్ని మార్చుకోవడానికి నేను ఎప్పుడూ శస్త్రచికిత్స చేయించుకోవాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 2019లో నా మొదటి సర్జరీ జరిగింది” అని ఆరవ్ కుంతల్ చెప్పాడు. మీరా అక్కాచెల్లెళ్లు ఆరవ్‌ను సోదరుడిగా భావించి రాఖీ కడుతున్నారు. వాళ్ల పిల్లలు ఆరవ్‌ను ఇప్పుడు మామయ్య అని పిలుస్తున్నారు.
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో తీర్పు వాయిదా
ఆరవ్‌తో తాను చాలా కాలంగా ప్రేమలో ఉన్నానని, శస్త్రచికిత్స చేయకున్నా అతడిని పెళ్లి చేసుకుంటానని వధువు కల్పన తెలిపింది. శస్త్ర చికిత్స జరుగుతున్న సమయంలో కల్పన ఆరవ్‌ను దగ్గరుండి చూసుకుంది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అనంతరం కుటుంబ సభ్యుల అనుమతితో నవంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. సాంప్రయేతరమైన, అరుదైన వారి వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం గమనార్హం.