Congress Leader Gopal Keshawat’s Daughter Kidnapped In Jaipur: కాంగ్రెస్ నేత కుమార్తె అహరణకు గురైంది. కూరగాయలు కొనేందుకు బజారు వెళ్లిన సమయంలో అపహరణకు గురైంది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు గోపాల్ కేశావత్ కుమార్తె 21 ఏళ్ల అభిలాష కూరగాయలు కొనేందుకు స్కూటర్ పై బయటకు వెళ్లింది. ఆ సమయంలోనే కిడ్నాప్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం జైపూర్ నగరంలోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వారు తెలిపారు పోలీసులు.
Read Also: Indian Army On POK: కేంద్రం ఆదేశాలు ఇవ్వడం ఆలస్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం
తన కుమార్తె కూరగాయలు కొనేందుకు బయటకు వెళ్లిన సమయంలో.. కొంత మంది తనను వెంబడిస్తున్నారని.. తనకు ఫోన్ చేసి చెప్పిందని, ఆ తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని అభిలాష తండ్రి గోపాల్ కేశాంత్ వెల్లడించారని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం ఎయిర్ పోర్టు రోడ్డులో మహిళ స్కూటర్ కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఆ ప్రాంతంలోని కూరగాయల వ్యాపారులను విచారించామని.. అయితే వారిలో ఎవరికీ దీనిపై ఎలాంటి సమాచారం తెలియలేదని పోలీస్ అధికారి భజన్ లాల్ తెలిపారు. కొంతమంది అనుమానితుల పేర్లను పోలీసులకు ఇచ్చినట్లు వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు బాధితురాలి తండ్రి గోపాల్ కేశావత్ తెలిపారు. కేశావంత్ 2008-2013 మధ్య రాజస్థాన్ రాజ్య విముక్త్ ఘుమంతు కళ్యాణ్ బోర్డు చైర్మన్ గా పనిచేశారు.