2011 Phool Mohammad case: పూల్ మహ్మద్ హత్య కేసులో మాజీ డీఎస్పీతో సహా 30 మందికి యావజ్జీవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
30 Jailed For Life In 2011 Rajasthan Murder Case: 2011లో రాజస్థాన్ ను కుదిపేసిన పూల్ మహ్మద్ హత్య కేసులో సవాయ్ మాధోపూర్ జిల్లాలోని ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. శుక్రవారం 30 మందిని దోషులుగా ప్రకటిస్తూ వారందరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారించిన ఈ కేసులో 30 మందిని దోషులుగా ప్రకటించగా.. 49 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసును బుధవారం విచారించిన స్పెషల్ కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. శిక్ష పడినవారిలో మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేంద్ర సింగ్ కూడా ఉన్నారు. సీబీఐ న్యాయవాది శ్రీదాస్ సింగ్ మాట్లాడుతూ.. ఈ కేసులో డీఎస్పీ మహేంద్ర సింగ్ తో పాటు 30 మందిని దోషులుగా నిర్థారించి జీవిత ఖైదు విధించడంతో పాటు జరిమానా విధించినట్లు వెల్లడించారు.
కేసు వివరాలు:
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
మార్చి 17,2011న సుర్వాన్ గ్రామంలో ఓ వ్యక్తి హత్య కేసులో పోలీసులు సరిగ్గా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ వాటర్ ట్యాక్ ఎక్కాడు. ఈ సమయంలో పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఫూల్ మహ్మద్ ఆ గ్రామానికి వెళ్లాడు. వాటర్ ట్యాంక్ పై నుంచి వ్యక్తి దూకేయడంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఆ ప్రాంతంలో మరపరమైన అల్లర్లు జరిగాయి. అక్కడికి వచ్చిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఫూల్ మహ్మద్ పై రాళ్లతో దాడి చేశారు. జీపులో తప్పించుకునేందుకు ప్రయత్నించిన ప్రజలు రాళ్లదాడి చేస్తూనే ఉన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన పూల్ మహ్మద్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఈ క్రమంలో గుంపు పోలీస్ వాహనానికి నిప్పు పెట్టి, పూల్ మహ్మద్ ను సజీవ దహనం చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయింది. మరణించిన తర్వాత రాజస్థాన్ రాష్ట్రప్రభుత్వం పూల్ మహ్మద్ కు అమరవీరుడి హోదా కల్పించడంతో పాటు ఈ ఘటనపై సీబీఐ ఎంక్వైరీ అప్పగించింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!