Sudden Heart Attack: దేశంలో ఆకస్మిక మరణాల సంఘటనలు పెరిగాయి. అప్పటి వరకు అందరితో కలిసి ఉన్న వ్యక్తులు… ఒక్కసారిగా మాయమైపోతున్నారు. క్షణాల్లో తిరిగి రాని లోకాలకు వెళ్తున్నారు. అనుకోకుండా ప్రాణాలు పోతాయి. వేదికపై డ్యాన్స్ చేస్తున్నప్పుడు లేదా మాట్లాడేటప్పుడు వారు కుప్పకూలిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బర్మా జిల్లాలో ఓ వృద్ధుడు బెంచీపై కూర్చుని దినపత్రిక చదువుతుండగా కుప్పకూలిపోయాడు. అకస్మాత్తుగా ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పచ్చపద్రలోని ఓ క్లినిక్ రిసెప్షన్‌లోని బెంచ్‌పై కూర్చుని న్యూస్ పేపర్ చదువుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. రిసెప్షన్‌లో ఉన్న అమ్మాయి వెంటనే అతని వద్దకు పరుగెత్తింది. బయటి నుంచి మరికొందరు కూడా వచ్చి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వార్తాపత్రిక చదువుతున్న వ్యక్తి కిందపడి చనిపోవడంపై నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Lunar Eclipse: అన్ని ఆలయాలు మూత.. అక్కడ మాత్రం ప్రత్యేక దర్శనాలు
అయితే ఇటీవల ఇలాంటి ఆకస్మిక మరణాలు ఎక్కువయ్యాయి. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తారాపూర్‌లోని నవరాత్రి వేడుకల్లో భాగంగా ఓ కాలనీలో వీరేంద్ర సింగ్ రమేష్ (21) అనే యువకుడు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. సరదాగా డ్యాన్స్ చేస్తూ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అప్పట్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
అయితే వృద్ధులే కాదు… యువకులు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. నవ్వుతూ, పాడుతూ, డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా మరణించిన సంఘటనలు ఎక్కువయ్యాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత దేశవ్యాప్తంగా గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని కొందరు నమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్‌లో వేదికపై ప్రదర్శనలు ఇస్తూ కళాకారులు మరణించిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
एक और चलते/फिरते मौत LIVE
राजस्थान के बाड़मेर में अख़बार पढ़ते हुए हार्ट अटैक आया और वहीं मौत।
सरकार को एक एक्सपर्ट की टीम बनाकर ऐसी आई तमाम मौत की जाँच कर रिसर्च करनी चाहिए। क्या पता इससे कई और ज़िंदगी बच जाए।Video via @Viveksbarmeri pic.twitter.com/CbBtbWle4r
— Narendra nath mishra (@iamnarendranath) November 6, 2022