Explosion On Train Track: రాజస్థాన్ రైల్వే ట్రాకుపై పేలుడు సంభవించింది. అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అసర్వా-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లడానికి గంటల ముందు, ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే దీంట్లో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయపూర్‌లోని జావర్ మైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెవ్డా కి నాల్ సమీపంలోని ఓధా వంతెనపై ట్రాక్‌లను దెబ్బతీయడానికి మైనింగ్ పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.
ఆదివారం ఉదయం ఈ పేలుడు సమాచారం స్థానిక ప్రజల నుంచి అందిందని.. ట్రాక్ పై కొన్ని పేలుడు పదార్థాలను కనుగొన్నట్లు పోలీస్ అధికారి అనిల్ కుమార్ విష్ణోయ్ వెల్లడించారు. పేలుడుకు బాధ్యులను గుర్తించడానికి ప్రయత్నాలు జరగుతున్నాయి. అయితే ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డీజీపీ ఉమేష్ మిశ్రాను ఆదేశించారు.
Read Also: Thieves Molested Wife: దారుణం.. దొంగతనానికి వచ్చి, భర్త ముందే భార్యపై అత్యాచారం
అక్టోబర్ 31న అహ్మదాబాద్ లోని అసర్వా రైల్వే స్టేషన్ నుంచి అసర్వా-ఉదయ్ పూర్ ఎక్స్‌ప్రెస్ ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. సరిగ్గా ఈ రైలు వెళ్లే గంట ముందే ట్రాక్ పై ఈ పేలుడు సంభవించడం అనుమానాలకు తావిస్తోంది. పేలుడు సమాచారం తెలిసిన తర్వాత రైలును దుంగార్ పూర్ స్టేషన్ లో నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. గనిలో ఉపయోగించే పేలుడు పదార్ధాలతో ట్రాకును దెబ్బతీయడానికి దుండగులు ప్రయత్నించారు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ కొన్ని చోట్ల విరిగిపోయిన నట్ బోల్టులు కనిపించలేదు. ఈ ఘటనపై రాష్ట్రపోలీసులతో పాటు రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు.
उदयपुर-अहमदाबाद रेल मार्ग के ओडा रेलवे पुल पर रेल पटरियों को नुकसान पहुंचाने की घटना चिंताजनक है। पुलिस व प्रशासन के वरिष्ठ अधिकारी मौके पर हैं। डीजी पुलिस को घटना की तह तक जाने के निर्देश दिए हैं।
— Ashok Gehlot (@ashokgehlot51) November 13, 2022