Rajastan : సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాజస్థాన్ మంత్రివర్గ విస్తరణ తేదీ ఖరారైంది. నేటి మధ్యాహ్నం 3:15 గంటలకు భజన్ లాల్ ప్రభుత్వం మంత్రివర్గం ఏర్పాటు చేయబడుతుంది. దాదాపు 18 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చర్చ జరుగుతోంది.
రాజస్థాన్ ప్రభుత్వం నూతన సంవత్సర కానుక ఇచ్చింది. జనవరి 1 నుండి ఉజ్వల గ్యాస్ సిలిండర్ రూ.450కు అందించనుంది. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా.. బిజెపి మేనిఫెస్టోలోని అన్ని హామీలలో ఉజ్వల పథకం లబ్ధిదారులకు 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలన్నింటినీ మోడీ హామీలుగా ప్రచారం చేసింది. ఇప్పుడు దీనిని నెరవేరుస్తూ ఉజ్వల పథకం లబ్ధిదారుల కోసం బీజేపీ ఈ ప్రకటన చేసింది.
Heater Incident: రాజస్థాన్ రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. గదిలోని హీటర్‌కి మంటలు అంటుకోవడంతో తండ్రి, మూడు నెలల కూతురు సజీవదహనమయ్యారు. ఖైర్తాల్-తిజారా జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. గదిలోని హీటర్‌తో మంటలు చెలరేగడంతో తండ్రీ, కూతురు మరణించారు. ఈ ఘటనలో అతని భార్యకు గాయాలయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో నెల రోజుల్లో 52 శాతం పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ చేసింది. భారత్ లోనూ కరోనా కేసుల పెరుగుదల కలవర పెడుతుంది.
భారతదేశం అంతటా హైవేల వెంట అనేక దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మీరు జోధ్‌పూర్ మరియు అహ్మదాబాద్‌లను కలుపుతూ జాతీయ రహదారి 62లో ప్రయాణిస్తే, మీకు అలాంటి పుణ్యక్షేత్రం ఒకటి కనిపిస్తుంది కానీ దేవుడు లేకుండా బుల్లెట్ బైక్ ఉంటుంది.. అలా ఉండటానికి పెద్ద కథే ఉందట.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ ఆలయంలోని ‘దేవత’ RNJ 7773 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన 350 cc రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్. ఓం బన్నా మందిరం లేదా…
రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. 13 ఏళ్ల మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి పది రోజులుగా ఆమె అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది. ఈ ఘటనపై బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. రాజస్తాన్‌కు చెందిన 13 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు.…
P Chidambaram React on Congress to lose in the Assembly Elections: ఇటీవల ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని తాము ఊహించలేదని ఆ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విజయం సాధించడం బీజేపీలో ఉత్సాహం నింపిందన్నారు. మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కుచెదరలేదని చిదంబరం పేర్కొన్నారు. ప్రతి…
Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది. అది కూడా 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి జరిగిన డిసెంబర్ 13 తేదీనే నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసులతో పార్లమెంట్ లోకి ప్రవేశించి, సభ జరిగే సమయంలో ఛాంబర్ లోకి దూసుకెళ్లి పొగ క్యానిస్టర్లను పేల్చారు.
Rajasthan: మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా కనిపిస్తే కామాంధుల చేతిలో బలైపోతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో చోట ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పోక్సో, ఇతర కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశాన్ని కదిపేసిన నిర్భయ తరహా సంఘటన మరోసారి రిపీట్ అయింది.
Bhajan Lal Sharma: రాజకీయ హేమాహేమీలు, దిగ్గజాలు ఉన్నా కూడా వారందరిని పక్కన పెట్టి అనూహ్యమైన వ్యక్తిని రాజస్థాన్ సీఎంగా ప్రకటించింది బీజేపీ. మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్ వంటి వ్యక్తులను పక్కనపెడుతూ.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌లాల్ శర్మకు రాజస్థాన్ అధికార పగ్గాలు అప్పగించింది. ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాగే విష్ణుదేవ్ సాయ్, మోహన్ యాదవ్‌లను సీఎంలుగా ప్రకటించిన సర్ప్రైజ్ చేసిన బీజేపీ, రాజస్థాన్ సీఎం అభ్యర్థి…