BJP MPs Resign: 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాషాయ జెండాను ఎగరేసింది. అయితే ఈ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థులను నిర్ణయించే విషయంలో బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. గతంలో ఉన్న సీఎంలు మార్చి కొత్త ముఖాలను తీసుకురావాలని అనుకుంటున్నట్లు సమాచారం.
INDIA bloc: ఇండియా కూటమి సమావేశానికి తేదీ ఖరారైంది. బుధవారం సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావించినప్పటికీ, పలువురు కీలక నేతలు గైర్హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మరో తేదీన ఇండియా కూటమి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. తాజాగా డిసెంబర్ 17 కూటమి నేతల భేటీ జరుగుతుందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం తెలిపారు.
Sukhdev Singh Gogamedi: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రముఖ రాజ్‌పుత్ నాయకుల్లో ఇతను ఒకరు. మంగళవారం జైపూర్‌లోని అతని నివాసంలో కాల్చి చంపబడ్డాడు. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన ఇంటిలో ఉండగా, గుర్తు తెలియని దుండగుడు చొరబడి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గోగమేడితో పాటు అతని ఇద్దరు సహచరులకు బుల్లెట్ గాయాలయ్యాయి.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించేసింది బీజేపీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 199 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 115 సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో బీజేపీ తరుపున ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజేనే ముఖ్యమంత్రిగా చేస్తారా..? లేకపోతే కొత్తవారిని సీఎం సీటు వరిస్తుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Rajyavardhan Rathore : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాని నాయకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే పార్టీ నేతలు నేరస్తులను హెచ్చరిస్తున్నారు.
నిన్న వెల్లడైన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది. 115 సీట్లు గెలుచుకుని అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో.. జైపూర్‌లోని హవా మహల్ సీటును గెలుచుకున్న బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ ప్రాంతంలోని వీధుల్లోని అన్ని నాన్ వెజ్ ఫుడ్ స్టాల్స్ను మూసివేయాలని ఆదేశించారు.
PM Modi: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. చలి నెమ్మదిగా వస్తుందని, అయితే రాజకీయ వేడి వేగంగా పెరుగుతోందని ప్రధాని అన్నారు.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఘనవిజయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు వ్యాఖ్యానించారు. 2024లో 350 సీట్లకు పైగా గెలిచి మరలా మరోసారి ప్రధాని మోడీ అని మరోసారి రుజువు చేసిన ప్రజా తీర్పు అని ఎంపీ జీవీఎల్ అన్నారు. మోడీ ప్రభుత్వం విశ్వసనీయత, అవినీతి రహిత పాలన ఈ మూడు రాష్ట్రాల్లో ఘన విజయానికి కారణమన్నారు.
Ashok Gehlot: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఆయన తన రాజీనామాను గవర్నర్కి అందించారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రా నివాసానికి వెళ్లి రాజీనామా సమర్పించారు. మొత్తం 199 స్థానాలకు గానూ ఎన్నికలు జరగగా.. బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఏర్పడింది. కాంగ్రెస్ 70 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ ఓటమి ఖాయం కావడంతో గెహ్లాట్ సర్కార్ గద్దెదిగబోతోంది.
Assembly election results 2023: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు దేశం మొత్తం కూడా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాయి. ఈ రోజు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందితే.. మిగిలిన మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది.