Blood transfusion: రక్తమార్పిడి విషయంలో వైద్య సిబ్బంది చాలా సీరియస్‌గా ఉండాలి. ఒక గ్రూపుకు బదులుగా వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే రోగి మరణించడం ఖాయం. అయితే, రాజస్థాన్‌లో ఓ వ్యక్తి ఇలాగే మరణించాడు. రాష్ట్రంలోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన 23 ఏళ్ల యువకుడికి తప్పుడు రక్తం ఎక్కించారు. చివరకు రోగి మరణించాడు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా గాంధీ.. తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. సోనియా గాంధీ ఫిబ్రవరి 15న రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు.. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ నుంచి సోనియా గాంధీతో పాటు.. బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్…
కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతల వల్ల దేశవ్యాప్తంగా చాలా చోట్ల గంటల కొద్దీ అంధకారం ఉండేది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కరెంట్ కొరత ఉంటే ఏ దేశం అభివృద్ది సాధించలేదు.. ఇక, కాంగ్రెస్ భవిష్యత్ గురించి ఊహించలేదు.. రోడ్డు మ్యాప్ గురించి ఆలోచించలేదు అని ప్రధాని తెలిపారు.
Kota: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలకు రాజస్థాన్ లోని కోటా నగరం పేరొందింది. ఇలాంటి ప్రాంతంలో వైద్య ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్‌కి గురైంది. సహ విద్యార్థులు ఈ దారుణాకి ఒడిగట్టారు. నిందితులు కూడా మైనర్లే అని తెలుస్తోంది. ఫిబ్రవరి 13న జరిగిన ఈ దారుణంలో, నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన తన క్లాస్‌మేట్‌తో స్నేహం చేస్తోంది. అతను బాలికను తన అపార్ట్మెంట్కి పిలిచారు. అక్కడ…
కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ (Soniya Gandhi) రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ (Rajasthan) నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆమె జైపూర్‌లో నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఇవాళ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఈరోజు ఉదయం జైపూర్ కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Another Student Dead in Rajasthan’s Kota: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఆత్మహత్యలకు అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. జేఈఈకి సిద్ధమవుతోన్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఏడాదిలో ఇది నాలుగో మరణం. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు అందరినీ కలవరపెడుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… ఝార్ఖండ్‌కు చెందిన శుభ్ చౌధరీ రెండేళ్లుగా జేఈఈకి…
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) ఈసారి రాజ్యసభకు (Rajya Sabha) పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్‌సభకు కాకుండా రాజ్యసభకు వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామనే సాకుతో ఇద్దరు వ్యక్తులు 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలోని సిరోహిలో జరిగింది. ఈ ఉదంతంలో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా గుర్తించారు.
Military Exercise : రాజస్థాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో భారత సైన్యం, రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్స్ మధ్య 'సదా తన్సీక్' పేరుతో మొదటి ఉమ్మడి సైనిక వ్యాయామం విజయవంతంగా పూర్తయింది.