Ram Temple: రామాలయ ప్రారంభోత్సవం వేళ గర్భిణుల వింత అభ్యర్థన.. అదే రోజు పిల్లలకి జన్మనివ్వాలని తల్లుల ఆరాటం.." /> Ram Temple: రామాలయ ప్రారంభోత్సవం వేళ గర్భిణుల వింత అభ్యర్థన.. అదే రోజు పిల్లలకి జన్మనివ్వాలని తల్లుల ఆరాటం.." />
Drinking water: ఇటీవల కాలంలో రెస్టారెంట్లు, కెఫేలు కస్టమర్లకు తాగేందుకు రెగ్యులర్ వాటర్ ఇవ్వడం లేదు. చివరకు రెస్టారెంట్లలో నీటిని కూడా కొనుక్కొవ్వాల్సి వస్తోంది. చివరకు థియేటర్లలో కూడా ఈ రకమైన పరిస్థితే ఎదురవుతోంది. గతంలో కొన్ని సందర్భాల్లో దేశంలోని పలు చోట్ల ఈ ఘటనకు కన్జూమర్ ఫోరం జరిమానా విధించినప్పటికీ వాటి తీరు మారడం లేదు.
తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లాలోని ఫారెస్ట్ కేఫ్ తన కస్టమర్‌కి రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ అందించడంలో విఫలమైంది. ఈ వ్యవహారంపై జోధ్‌పూర్ జిల్లా కమిషన్ కస్టమర్‌కి పరిహారంగా రూ.20,000 చెల్లించాలని ఆదేశించింది. జోధ్‌పూర్‌లోని ఫారెస్టా కేఫ్ బాటిల్ గరిష్ట రిటైల్ ధర (MRP) కంటే ఎక్కువ వసూలు చేసిందని కస్టమర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేఫ్‌ని బాధ్యుడిగా చేస్తూ, ఫిర్యాదుదారుకి రూ.20,000 పరిహారంతో పాటు న్యాయపరమైన ఖర్చులకు రూ.2500 చెల్లించాలని జిల్లా కమిషన్ కేఫ్‌ని ఆదేశించింది.
2019లో, మిస్టర్ అవినాష్ ఆచార్య (“ఫిర్యాదుదారు”) భోజనం కోసం ఫారెస్టా కేఫ్ (“కేఫ్”)కి వెళ్లాడు. ఆచార్య వెయిటర్ నుంచి సాధారణ తాగు నీటిని ఇవ్వాలని కోరాడు. అయితే, వెయిటర్ మాత్రం మినరల్ వాటర్ ఇస్తానని, దీనికి ఛార్జ్ చేస్తానని చెప్పాడు. దీని తర్వాత అతను ఆనియన్-క్యాప్సికమ్ పిజ్జా ఆర్డర్ చేశాడు. అయితే మొత్తం బిల్ రూ. 273 అయింది. మినరల్ వాటర్ బాటిల్ ధర రూ. 20 ఉంటే, కేఫ్ రూ.35 వసూలు చేసింది. దీనిపై మేనేజర్‌ని ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆచార్య జోధ్‌పూర్ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. కస్టమర్ల సౌలభ్యం కోసం కేఫ్ తప్పనిసరిగా రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ అందించాలని స్పష్టం చేసింది. అధిక ఛార్జీలు వసూలు చేసి, కేఫ్ తప్పు చేసిందని జరిమానా విధించింది. కేఫ్ మినరల్ వాటర్ బాటిల్‌పై అదనంగా తీసుకున్న రూ.15ని ఇవ్వడమే కాకుండా అతని శారీరక, మానసిక బాధకు పరిహారంగా రూ. 20,000 చెల్లించాలని, అదే విధంగా రూ. 2500 న్యాయపరమైన ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది.