Gas Cylinder: రాజస్థాన్‌లో రూ.50 తగ్గిన ఉజ్వల గ్యాస్ సిలిండర్ ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ ప్రభుత్వం నూతన సంవత్సర కానుక ఇచ్చింది. జనవరి 1 నుండి ఉజ్వల గ్యాస్ సిలిండర్ రూ.450కు అందించనుంది. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా.. బిజెపి మేనిఫెస్టోలోని అన్ని హామీలలో ఉజ్వల పథకం లబ్ధిదారులకు 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలన్నింటినీ మోడీ హామీలుగా ప్రచారం చేసింది. ఇప్పుడు దీనిని నెరవేరుస్తూ ఉజ్వల పథకం లబ్ధిదారుల కోసం బీజేపీ ఈ ప్రకటన చేసింది.
ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చిన బీజేపీ.. రాజస్థాన్‌లో జనవరి 1, 2024 నుంచి ఉజ్వల గ్యాస్ సిలిండర్‌ను రూ.450కే అందజేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ సిలిండర్లను రూ.500కే ఇస్తున్నారు. బుధవారం టోంక్‌లో జరిగిన వికాసతి భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ.. ఈ విషయాన్ని ప్రకటిస్తూ తీర్మాన లేఖలోని హామీ మేరకు రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.
Also Read
KC Cariappa: మాజీ లవర్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో విడుదల చేసిన కర్ణాటక క్రికెటర్
రాజస్థాన్‌లో బీజేపీ చేసిన వాగ్దానాలు:
– ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.450కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ.
– ఐదేళ్లలో 2.5 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
– కిసాన్ సమ్మాన్ నిధి కింద వచ్చే మొత్తాన్ని రూ.12,000కు పెంచుతామని హామీ ఇచ్చారు.
– ప్రతి జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా పోలీస్ స్టేషన్, మహిళా డెస్క్, యాంటీ రోమియో స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తారు.
– 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన బాలికలకు స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చారు.
– పేద కుటుంబాల బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యనందిస్తారు.
- Tags
- bjp
- gas cylinders
- Price
- Rajasthan
- Slash
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!