Pension fraud in Rajasthan: రాజస్థాన్‌లో నకిలీ పెన్షనర్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో 4 లక్షల మంది పెన్షన్లు నిలిపివేసింది. సామాజిక న్యాయం, సాధికారత శాఖ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు స్కాలర్‌షిప్ పథకంలో అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక, స్కాలర్‌షిప్ పథకంలో అక్రమాలకు పాల్పడిన వారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయనున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వని వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు.
Read Also: Eagle: బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం… మారింది తేది మాత్రమే మాసోడి మార్క్ కాదు
అయితే, రాజస్థాన్ ఎస్ఎస్పీ యాప్ ద్వారా పెన్షన్ మోసాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల వెల్లడైన సమాచారం ప్రకారం.. పెన్షన్ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. రాజస్థాన్ లో లక్ష 13 వేల మంది పెన్షన్ పొందుతున్నట్లు విచారణలో తేలింది. అక్రమాలు వెలుగులోకి రావడంతో వీరికి పింఛన్ నిలిచిపోయింది. దీంతోపాటు 34 వేల 444 మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల పెన్షన్ కూడా నిలిపివేశారు.
ఇక, రాజస్థాన్‌లో 4, 729 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటునట్లు గుర్తించారు. వీరితో పాటు 93 వేల 376 మంది డూప్లికేట్ పింఛనుదారులు, 3, 210 మందికి జనధార్ కార్డు లేకపోవడంతో వీరందరికీ తక్షణమే పింఛను నిలిపివేశారు. సామాజిక న్యాయ కార్యదర్శి సమిత్ శర్మ ఆదేశాలతో తక్షణ చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు స్కాలర్‌షిప్ పథకాల్లో విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.