Kota: “మమ్మీ, డాడీ, ఈ జేఈఈ నావల్ల కాదు”.. కోటాలో మరో ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kota: రాజస్థాన్ కోటాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. కోటాలో 18 ఏళ్ల జేఈఈ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులను ఉద్దేశించి సూసైడ్ నోట్ రాసింది. పరీక్షకు రెండు రోజుల ముందు ఆమె ఆత్మహత్య చేసుకుంది. కోటాలో వారం రోజుల్లో ఇది రెండో ఆత్మహత్య.
Read Also: MK Stalin-Djokovic: ఆకాశంలో ఆశ్చర్యం.. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌ను కలిసిన తమిళనాడు సీఎం!
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
చనిపోయిన విద్యార్థినిని 18 ఏళ్ల నిహారికగా గుర్తించారు. కోటలోని శిక్షానగరి ప్రాంతంలో తన ఇంటి గడిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె పరీక్ష జనవరి 31న జరగాల్సి ఉంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తోంది. ‘‘తాను ఒక వరస్ట్ కూతురిని, ఇదే తనకు లాస్ట్ ఆప్షన్’’ అని రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ‘‘అమ్మా, నాన్న, ఈ జేఈఈ నావల్ల కాదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేనే కారణం. నేను మంచి కూతుగా ఉండలేకపోయాను. క్షమించండి అమ్మా నాన్న. ఇదే చివరి ఆప్షన్’’ అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
అంతకుముందు జనవరి 23న కోటాలో ప్రైవేట్ కోచింగ్ ద్వారా నీట్‌కు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొరాదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్ తన గదిలో ఉరివేసుకుని కనిపించాడు. సూసైడ్ నోట్ దొరకలేదు. ఇంజినీరింగ్ మరియు మెడికల్ ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు పేరుగాంచిన కోటాలో 2023లో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
- Tags
- JEE
- kota
- Rajasthan
- Teen suicide
తాజావార్తలు
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు